GT vs MI: పీకల్లోతు కష్టాల్లో గుజరాత్.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Scored 82 Runs In First 10 Overs Against MI: ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి ఈ జట్టు ఏకంగా 5 వికెట్లు కోల్పోయి, 82 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 137 పరుగులు చేయాలి. అంటే.. ఓవర్‌కి 14 రన్ రేట్‌తో పరుగులు బాదాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీ లక్ష్యాన్ని జీటీ ఛేధించడమనేది.. కత్తిమీద సాము వంటిది. ప్రస్తుతం క్రీజులో ఉన్న తేవాతియా, డేవిడ్ మిల్లర్లు మాత్రమే భారీ ఇన్నింగ్స్ ఆడగలరు. కాకపోతే.. వీళ్లు చివరివరకు రాణించగలరా? అనేది అతిపెద్ద ప్రశ్న. భారీ ఇన్నింగ్స్ ఆడగల బ్యాటర్లు ఇంకెవరూ లేరు కాబట్టి.. వీళ్లిద్దరే చివరివరకు నెట్టుకురావాల్సి ఉంటుంది.
Off The Record: గ్రేటర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు మధ్య కయ్యాలు..!
Also Read

నిజానికి.. జీటీ టాపార్డర్ అద్భుతంగా ఉంది కాబట్టి, పవర్ ప్లేలో బౌండరీల మోత మోగిస్తారని అంతా అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా జీటీ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలుత సాహా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. హార్దిక్ ఆ వెంటనే క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం వచ్చిన విజయ్ శంకర్ కాసేపు మెరుపులు మెరిపించాడు. ఏకంగా ఆరు ఫోర్లు బాదాడు. జేసన్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. అతని దూకుడు చూసి.. జట్టుని లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తాడని అనుకున్నారు. కానీ.. ఇంతలోనే పియూష్ చావ్లా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభివన్ మనోహర్ కూడా కార్తికేయ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. థర్డ్ డౌన్‌లో వచ్చిన డేవిడ్ మిల్లర్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. తేవాతియా కూడా అతనికి మద్దతు ఇస్తున్నాడు. మరి.. జీటీ ఎంతమేర రాణిస్తుందో చూడాలి.
Bandla Ganesh: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి బండ్లన్న రీ ఎంట్రీ.. ఏ పార్టీలో..?
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!