GT vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Won The Toss And Chose To Field Against Mumbai Indians: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జీటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. ముంబై జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు గెలిస్తే.. ప్లేఆఫ్స్‌లో తన బెర్త్ కన్ఫమ్ చేసుకుంటుంది. అప్పుడు ముంబై జట్టుకి ప్లేఆఫ్స్ ఆశలు కష్టతరం అవుతాయి. ఇతర జట్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ముంబై గెలిస్తే మాత్రం.. దాదాపు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నట్టే. అఫ్‌కోర్స్.. ఆల్రెడీ ముంబై జట్టు టాప్-4లో నాల్గవ స్థానంలో ఉంది. కానీ.. రన్ రేట్ మాత్రం నెగెటివ్‌లో ఉంది. దీనికితోడు ఫ్లేఆఫ్స్‌లో చోటు కోసం ఇంకా చాలా జట్లు తలపడుతున్నాయి. వారితో పోటీ ఉండకుండా ఉండాలంటే.. ముంబై ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. ఒకరకంగా.. ముంబై జట్టుకి ఇది డూ ఆర్ డై మ్యాచ్ అన్నమాట!
Yashasvi Jaiswal: జైస్వాల్ వీరవిహారం.. దెబ్బకు ఐదు రికార్డులు మటాష్
Also Read

ఇప్పటికే ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో ఒకసారి తలపడ్డాయి. ఏప్రిల్ 25న మ్యాచ్ జరగ్గా.. ఏకంగా 55 పరుగుల తేడాతో జీటీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్‌లో జీటీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. ముంబై 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితం అయ్యింది. నేహాల్ వధేరా (40) మినహాయిస్తే.. మిగతా ముంబై బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో, ముంబై జట్టుకి ఆ ఘోర పరాజయం తప్పలేదు. మరి.. అందుకు ముంబై జట్టు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందా? జీటీని ఓడిస్తుందా? అప్పుడు ఫామ్‌లో లేని ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు పామ్‌లోకి తిరిగొచ్చారు. వాళ్లు ఫామ్‌లోకి వచ్చినప్పటి నుంచి ముంబై జట్టు విజయాలు నమోదు చేస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ వాళ్లు సత్తా చాటితే.. ముంబై విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అలాగని జీటీ జట్టుని తక్కువ అంచనా వేయలేము. ఈ సీజన్‌లోనే అత్యధిక విజయాలతో ఇది టాప్-1 ప్లేస్‌లో ఉంది. అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తోంది కాబట్టి, దూసుకుపోతోంది. అలాంటి జట్టుపై గెలుపొందాలంటే.. ముంబై అన్ని విభాగాల్లో రాణించాలి.
Virat – Rohit: రోహిత్, కోహ్లీల పని అయిపోయింది.. మాజీ సెలక్టర్ సంచలన ట్వీట్
తాజావార్తలు
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!