ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన వస్తున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ పోరులో చెన్నైకి 25 బంతుల్లో 54 పరుగులు అవసరమైనపుడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మహీ 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో చెన్నై 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మరీ దిగువన వస్తుండడంపై…
ఐపీఎల్ 2025లో భాగంగా గువాహటి వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై విజయానికి 20వ ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా.. క్రీజ్‌లో ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా ఉన్నారు. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ తొలి బంతికే ధోనీని అవుట్ చేశాడు. ఆపై 13 పరుగులే చేయడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్…
పవర్ ప్లేలో అదనంగా పరుగులు ఇవ్వడం, ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు ఓపెనర్ల వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10×4, 5×6) అద్భుత బ్యాటింగ్ చేశాడని ప్రశంసించాడు. రాజస్థాన్ ఇచ్చిన టార్గెట్ ఛేదించదగినదే అని, గౌహతి బ్యాటింగ్‌కు మంచి వికెట్ అని చెప్పాడు. మ్యాచ్‌లో ఓడినా తమకు సానుకూల అంశాలు ఉన్నాయని రుతురాజ్ పేర్కొన్నాడు. ఆదివారం గౌహతిలో…
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ఎంఎస్ ధోని మరింత సహకారం అందించగలడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ధోని జట్టుకు తక్కువ ఉపయోగం అవుతున్నారు.. అతను మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని మంజ్రేకర్ సూచించాడు.
IPL 2025 లో జరిగిన 8వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిఎస్కెను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. 50 పరుగుల తేడాతో సీఎస్కే ఓడిపోవడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్…
ఆర్సీబీ చేతిలో చెన్నై ఓటమికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలలో ఒకటి ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అభిమానులతో పాటు, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. దీని గురించి ఇర్ఫాన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. చెన్నైకి పూర్తి అనుకూలంగా ఉన్న పిట్లో 17 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ గెలవడం గమనార్హం.…
చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025లో వికెట్ల వెనుక చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ధోని చిరుతపులి వేగంతో ఫిల్ సాల్ట్‌ను స్టంప్ చేసి సీఎస్కేకు కీలకమైన బ్రేక్ అందించాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. కాసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
మైదానంలో క్లిష్ట సమయాల్లో ఎలా ఉండాలో తన మెంటార్ ఎంఎస్ ధోనీ నుంచి నేర్చుకొన్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మన చేతుల్లో లేనివాటి గురించి ఆలోచించడం అనవసరమన్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించడం సంతోషం కలిగించిందన్నాడు. శార్దూల్ ఠాకూర్ అద్భుతం అని పంత్ ప్రశంసించాడు. గురువారం ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 5 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్…
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. గతేడాది ఆర్సీబీ తరుపున చెత్త ప్రదర్శన చేసిన మ్యాక్సీని ఆ జట్టు వేలంలోకి వదిలేసింది. దీంతో రూ.11 కోట్ల ధర నుంచి రూ.4 కోట్లకు పడిపోయాడు. ఐపీఎల్ 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని 4 కోట్లకే దక్కించుకుంది. అయితే ఈ సీజన్లోనూ మాక్స్వెల్ ప్రదర్శనలో మార్పు లేదు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో ఐపీఎల్లో అత్యధిక సార్లు (19)…