MS Dhoni: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ హిస్టరీలోనే మొదటి ఆటగాడు!
- ఐపీఎల్‌లో ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు
- మొదటి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు
- కెప్టెన్‌గా వ్యవహరించిన అతి పెద్ద వయస్కుడిగా ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌గా బరిలోకి దిగడంతో మహీ ఈ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ అన్‌క్యాప్డ్ ప్లేయర్ కెప్టెన్‌గా వ్యవహరించలేదు.
బీసీసీఐ రూల్స్ ప్రకారం.. గత ఐదేళ్లలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడు అయినా అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించబడతాడు. ఐదేళ్ల క్రితం 2019లో మహీ చివరగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్‌క్యాప్డ్ కోటాలో రూ.4 కోట్లు వెచ్చించి సీఎస్‌కే అతడిని రిటైన్ చేసుకుంది. సీఎస్‌కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీ మొత్తంకు దూరమయ్యాడు. దాంతో ధోనీ మరలా చెన్నై పగ్గాలు అందుకున్నాడు. దాంతో ధోనీ ఐపీఎల్ హిస్టరీలోనే అన్‌క్యాప్డ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అతి పెద్ద వయస్కుడిగా ధోనీ (43 సంవత్సరాల 278 రోజులు) మరో ఘనత సాధించాడు.
Also Read
- Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
- Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
Also Read: Gorantla Madhav: రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్!
2008లో చెన్నై కెప్టెన్సీ చేపట్టిన ఎంఎస్ ధోనీ.. 2021 వరకు విజయవంతంగా కొనసాగాడు. ఈ కాలంలో నాలుగు సార్లు (2010, 2011, 2018, 2021) జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 2022లో రవీంద్ర జడేజా సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు. వరుస మ్యాచ్‌లలో ఓడిపోవడంతో జడేజా స్వయంగా కెప్టెన్సీని విడిచిపెట్టాడు. దాంతో సీఎస్‌కే ఫ్రాంచైజీ ధోనీని మరోసారి కెప్టెన్‌ను చేసింది. 2023లో కూడా ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించి.. సీఎస్‌కేను విజేతగా నిలిపాడు. 2024లో ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్ 2025లో రుతురాజ్ గాయం కారణంగా.. ధోనీ మళ్లీ సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
తాజావార్తలు
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!