ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించి.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్, లక్నో, చెన్నైపై గెలిచిన పంజాబ్.. రాజస్థాన్ చేతిలో మాత్రం ఓడింది. ఇక ఏప్రిల్ 12న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో ఢీకొనేందుకు సిద్దమైంది. అయితే మంగళవారం రాత్రి చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కో ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటాకు సంబంధించిన ఓ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య 8 బంతులే ఆడాడు.. పంజాబ్ కోచ్ ఆసక్తికర విశేషాలు!
చెన్నైపై విజయంలో ప్రియాంశ్ ఆర్య (103; 42 బంతుల్లో 7×4, 9×6)తో పాటు శశాంక్ సింగ్ (52 నాటౌట్; 36 బంతుల్లో 2×4, 3×6) కూడా కీలక పాత్ర పోషించాడు. దూకుడు మీదున్న శశాంక్ 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నపుడు.. రచిన్ రవీంద్ర క్యాచ్ డ్రాప్ చేశాడు. నూర్ అహ్మద్ వేసిన 17వ ఓవర్లో బంతి శశాంక్ బ్యాట్ టాప్ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది. సునాయాస క్యాచ్‌ను రచిన్ నేలపాడు చేశాడు. వెంటనే పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా స్టాండ్స్‌లో ఎగిరి గంతేశారు. పరిగెడుతూ వెళ్లి పక్కనున్న వారితో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అదే సమయంలో మైదానంలో చెన్నై కీపర్ ఎంఎస్ ధోనీ.. రచిన్ వైపు చూస్తూ సీరియస్ లుక్ ఇచ్చాడు. కెమెరామెన్ ఈ రెండు దృశ్యాలను ఒకేసారి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Preity zinta cutie enjoying shashank’s catch drop😇😇
Thankyou csk 🤣🤣 #CSKvsPBKS #pbksvscsk pic.twitter.com/xpCdtuuz6v— gαנαℓ (@Gajal_Dalmia) April 8, 2025