ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఎల్‌ఎస్‌జీపై ధోనీ (26 నాటౌట్; 11 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
43 సంవత్సరాల 282 రోజుల వయసులో ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అంతకుముందు 2014లో ప్రవీణ్ తంబే 42 సంవత్సరాల 209 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు తంబే రికార్డును ధోనీ బ్రేక్ చేశాడు. 2011లో షేన్ వార్న్ రెండుసార్లు ఈ అవార్డు గెలుచుకున్నాడు. 41 సంవత్సరాల 223 రోజుల వయసులో, 41 సంవత్సరాల 211 రోజుల వయసులో వార్న్ అవార్డు అందుకున్నాడు. 2013లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 41 సంవత్సరాల 181 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఖాతాలో వేసుకున్నాడు.
Also Read: Ayush Mhatre-CSK: అందరి అంచనాలకు భిన్నంగా.. చెన్నై జట్టులోకి 17 ఏళ్ల కుర్రాడు!
అతి పెద్ద వయస్కుడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లిస్ట్:
ఎంఎస్ ధోనీ – 43 సంవత్సరాల 282 రోజులు (2025)
ప్రవీణ్ తంబే – 42 సంవత్సరాల 209 రోజులు (2014)
షేన్ వార్న్ – 41 సంవత్సరాల 223 రోజులు (2011)
షేన్ వార్న్ – 41 సంవత్సరాల 211 రోజులు (2011)
ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 41 సంవత్సరాల 181 రోజులు (2013)
క్రిస్ గేల్ – 41 సంవత్సరాల 35 రోజులు (2020)
షేన్ వార్న్ – 40 సంవత్సరాల 204 రోజులు (2010)
ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 40 సంవత్సరాల 185 రోజులు (2012)
రాహుల్ ద్రవిడ్ – 40 సంవత్సరాల 85 రోజులు (2013)