CSK vs KKR: చెన్నై వేదికగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్ లో తలపడనుంది. ధోని సారధ్యంలో సీజన్లో మొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోతోంది. చెన్నై ఆడిన గత ఐదు మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి నాలుగు మ్యాచులు ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. మరొకవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదు మ్యాచ్లలో రెండు గెలిచి, మూడు మ్యాచులు ఓడిపోయి ఆరో స్థానంలో ఉంది. ఇకపోతే మ్యాచ్ టాస్ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్నారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈరోజు మ్యాచ్ ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: New Tatkal Timings: రేల్వే ప్రయాణికులకు అలెర్ట్.. తత్కాల్ బుకింగ్ సమయాల్లో మార్పులు
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI:
డెవోన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎం.ఎస్. ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, నూర్ అహ్మద్, అంషుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
మతీష పథిరాన, కమలేష్ నాగర్‌కోటి, షేక్ రషీద్, జేమీ ఓవర్టన్, దీపక్ హూడా.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI:
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునిల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రే రసెల్, రామందీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రానా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
అంకృష్ రఘువంశీ, మనీష్ పాండే, అనుకుల్ రాయ్, రోవ్‌మాన్ పోవెల్, లవ్నిత్ సిసోడియా