ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 150వ క్యాచ్‌ను అందుకున్న మొదటి వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో నేహల్ వధేరా క్యాచ్‌ను అందుకోవడంతో మహీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఈ రికార్డుకు చేరువలో మరెవరూ కూడా లేరు.
మొత్తంగా 43 ఏళ్ల ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో 154 క్యాచ్‌లు అందుకున్నాడు. అందులో నాలుగు క్యాచ్‌లు ఫీల్డర్‌గా అందుకోగా.. 150 క్యాచ్‌లు కీపర్‌గా పట్టుకున్నాడు. ఈ జాబితాలో మహీ తర్వాతి స్ధానంలో మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ (137) ఉన్నాడు. వృద్దిమాన్ సాహా (87), రిషబ్ పంత్ (76), క్వింటన్ డికాక్ (66) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోనీకి దరిదాపుల్లో ఉన్న దినేష్ కార్తీక్ ఇప్పటికే రిటైర్ అయ్యాడు కాబట్టి.. మహీ రికార్డు ఇప్పట్లో బద్దలయ్యే అవకాశమే లేదు.
Also Read: Mujra Party: మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం.. ఏడుగురు అమ్మాయిలతో..!
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 రన్స్ చేసింది. ప్రియాంశ్ ఆర్య (103; 42 బంతుల్లో 7×4, 9×6) మెరుపు సెంచరీ చేయగా.. శశాంక్ సింగ్ (52 నాటౌట్; 36 బంతుల్లో 2×4, 3×6) అర్ధ సెంచరీ బాదాడు. చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (2/45), ఆర్ అశ్విన్ (2/48) ఆకట్టుకున్నారు. ఛేదనలో చెన్నై 5 వికెట్లకు 201 రన్స్ చేసి ఓడింది. డెవాన్ కాన్వే (69; 49 బంతుల్లో 6×4, 2×6), రచిన్ రవీంద్ర (36; 23 బంతుల్లో 6×4) రాణించారు. ఎంఎస్ ధోనీ (27; 12 బంతుల్లో 4×4, 3×6) ఆకట్టుకున్నాడు.