Dhoni chants: టీమిండియా మాజీ కెప్టెన్, కెప్టెన్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ థాలా.. ఇవీ మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు. ఎంఎస్కి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.
ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న మహీ భారత జట్టుకు హెడ్ కోచ్ గా రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. భారత జట్టు హెడ్ కోచ్ గా ధోనీ వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఓ చిన్న హింట్ మాత్రం ఇచ్చాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠంగా జరిగే అవకాశం ఉంది.
మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే! అది నిజమేనన్నట్టు ధోనీ సైతం ఒక స్పీచ్లో సంకేతాలూ...