క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. మన ఇండియా మ్యాచ్ ఉందంటే చాలా మంది పనులు మానుకొని మరీ చూస్తుంటారు.. ఇండియన్ క్రికెటర్ ధోని అంటే చాలామందికి అమితమైన ఇష్టం ఉంటుంది.. ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.. చాలామంది అభిమానులు తమ అభిమాన్ని వెరైటీగా చాటుకున్నారు.. తాజాగా ఓ వీరాభిమానికి ధోనిపై అభిమాన్ని చాటుకున్నాడు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని పేరు టక్కున గుర్తుకు వస్తుంది..ఐపీఎల్‌లో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో పదిసార్లు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు ధోని. ఇదిలా ఉంటే.. ధోనిపై ఉన్న అభిమానాన్ని అభిమానులు ఏదో ఒక రూపంలో నిరూపించుకుంటూనే ఉంటారు.. ఈ క్రమంలో ఓ తెలుగు యూట్యూబర్ వినూత్న ఆలోచన చేశాడు..
ఈ మేరకు ప్రపంచంలోనే అతిపెద్ద థ్రెడ్ ఆర్ట్‌తో ధోని చిత్రాన్ని రూపొందించారు. ‘తెలుగు ఎక్స్‌పెరిమెంట్స్’ అనే యూట్యూబ్ ఛానెల్ నడిపూ కిరణ్ అనే వ్యక్తి 20-20 అడుగుల సైజ్‌తో ధోని చిత్రాన్ని తన స్నహితుల సహాయంతో చిత్రీకరించారు… ఆ చిత్రాన్ని తయారు చెయ్యడానికి వారికి నాలుగు రోజుల సమయం పట్టిందని చెప్పాడు.. మొత్తానికి సక్సెస్ అయ్యాడు.. తాను అనుకున్న విధంగానే వరల్డ్ బిగ్గెస్ట్ గిఫ్ట్ ను ధోనికి ఇచ్చాడు.. గ్రేట్ కదా..ఈ ఆర్ట్ కు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ధోని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు..