IPL 2023 Finals: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, ఐదోసారి కప్పును ముద్దాడింది. చివరి రెండు బంతుల్లో పది పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు.. జడేజా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఒక బంతికి సిక్స్, మరో బంతికి ఫోర్ కొట్టి.. చెన్నైను విజయతీరాలకు చేర్చాడు. తొలి నాలుగు బంతుల్ని కట్టడి చేయగలిగిన గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ, చివరి రెండు బంతులున్నప్పుడు తడబడ్డాడు. ఒత్తిడి గురై, షాట్ బంతులు వేసేశాడు. ఆ రెండింటిని జడేజా సద్వినియోపరచుకొని, ఫినిషింగ్ టచ్‌తో తన జట్టుని గెలిపించుకున్నాడు.
Viral news : ఓరి నాయనో..కొంచెం కూడా సిగ్గులేదేంట్రా బాబు.. బైకుపైనే పాడుపని.. ఛీ..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 96 పరుగులతో వీరవిహారం చేయడం, ఓపెనర్ సాహా అర్థశతకంతో రాణించడంతో.. గుజరాత్ అంత భారీ పరుగులు చేయగలిగింది. అనంతరం 215 లక్ష్యంతో చెన్నై బరిలోకి దిగగా.. వర్షం ఆటంకం కలిగించింది. దీంతో.. చెన్నై లక్ష్యాన్ని డక్‌వర్త్ ల్యూయిస్ పద్ధతి ప్రకారం 15 ఓవర్లలో 171 పరుగులకి కుదించారు. పరిస్థితులు సద్దుమణిగాక బరిలోకి దిగిన చెన్నై జట్టు.. 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆ లక్ష్యాన్ని ఛేధించింది. క్రీజులోకి దిగిన ఆది నుంచే చెన్నై ఓపెనర్లు దంచికొట్టారు. జీటీ బౌలర్లకు చుక్కలు చూపించారు. అయితే.. ఓపెనర్లు వెనువెంటనే ఔట్ అవ్వగానే, చెన్నై ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. లక్ష్యం చేరువవుతున్నకొద్దీ.. చెన్నై బ్యాటర్లు ఒక్కొక్కరుగా విజృంభించారు.
Cyber Crime: డేటింగ్ యాప్‌లో కలిశాడు.. మహిళని నిండా దోచేశాడు
రాయుడు ఔట్ అయ్యాక ధోనీ క్రీజులోకి వచ్చినప్పుడు.. అతని నుంచి ఈ ఫైనల్‌లో ఒక మెమొరబుల్ ఇన్నింగ్స్ చూడబోతున్నామని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, అతడు క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి పెవిలియన్ బాట పట్టాడు. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక చివరి ఓవర్‌లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. మోహిత్ శర్మ తొలి బంతిని డాట్ బాల్‌గా మలిచాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో మూడు సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక రెండు బంతుల్లో 10 కొట్టాల్సి ఉండగా.. మోహిత్ డిఫెండ్ చేస్తాడని అనుకున్నారు. కానీ, అతడు తడబడ్డాడు. వరుసగా సిక్స్, ఫోర్ ఇచ్చేశాడు. దీంతో.. చెన్నై ఐదోసారి కప్‌ని ముద్దాడింది.