ఐపీఎల్ లో నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన మహేంద్ర సింగ్ ధోని మరోసారి సీఎస్కేకు టైటిల్ అందించాలని ఆ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా అన్నాడు. సీఎస్కే పదోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో నిలవడం పట్ల ఆయన సంతోసం వ్యక్తం చేశాడు. టోర్నీ ఆసాంతం చెన్నై సూపర్ కింగ్స్ ని అద్భుతంగా నడిపించిన మిస్టర్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అతను ఆకాశానికెత్తాడు. జడేజా, దీపక్ చాహర్ లు తప్ప జట్టులో స్టార్ బౌలర్లు లేకపోయినా.. సీఎస్కే టీమ్ ను ఫైనల్స్ కు చేర్చిన మహీపై ప్రశంసలు కురిపించాడు.
Also Read : Naveen Patnaik: విపక్షాలకు షాక్.. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామన్న బీజేడీ..
ఎంఎస్ ధోని ముట్టుకున్న ప్రతిది బంగారమవుతుందంటూ సురేశ్ రైనా అన్నాడు. ధోని ప్రతి విషయాన్ని చాలా సులువుగా మార్చుతారు.. యావత్ భారత్ దేశం మొత్తం ఈ సంవత్సరం ఐపీఎల్ టైటిల్ గెలవాలని కోరుకుంటుంది అని రైనా వెల్లడించాడు. ఏమాత్రం అనుభవం లేని మహీశ్ థీక్షణ, మతీశా పతీరానా ( శ్రీలంక), తుషార్ దేశ్ పాండే వంటి దేశీయ బౌలర్లపై నమ్మకం ఉంచి.. వాళ్లను మ్యాచ్ విన్నర్లుగా మార్చాడు. తెలివైన వ్యూహాలతో.. సరైనా సమయంలో బౌలింగ్ మార్పులతో తుది ఫలితాలను ఎంఎస్ ధోని రాబట్టాడు అంటూ రైనా పేర్కొన్నాడు.
Also Read : YS Viveka Case: ఎంపీ అవినాష్‌రెడ్డి వ్యవహారంపై ఉత్కంఠ.. రేపు ఏం జరగబోతోంది..?
గత సీజన్ లో దారుణ ప్రదర్శనతో 9వ స్థానంలో ధోని సేన నిలిచింది. కానీ ఈ సారి మాత్రం సెకండ్ స్థానంలో నిలిచింది. ఒక్క ఏడాదిలో జట్టు కూర్పు.. ఆటగాళ్ల ఆట తీరు మారడం వెనక ధోని తన మార్క్ ను చూపించాడు.. అందుకు ఉదాహారణ వీళ్లే.. కెరీర్ ఇక ముగిసింది అనుకున్నా.. అజింక్యా రహానేకు సపోర్ట్ గా నిలిచాడు. యంగ్ స్టార్ శివమ్ దూబే.. సిక్సర్ల దూబేగా మారడం వెనక ధోని పాత్ర ఉంది. జట్టులో ఫ్రెండ్లీ వాతావరణం ఉండేలా చూసి.. ఆటగాళ్ల శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచిన ధోని సీఎస్కేను ఛాంపియన్ గా తయారు చేశాడు అంటూ సురేశ్ రైనా అన్నాడు.