CSK vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న సీఎస్కే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Super Kings Won The Toss And Chose To Field: ఐపీఎల్ 2023 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నేడు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ టైటిల్ కోసం చివరి పోరు జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. నిజానికి.. ఈ మ్యాచ్ నిన్న ఆదివారమే జరగాల్సింది. కానీ.. వర్షం ఆటంకం కలిగించడంతో, నేటికి వాయిదా వేశారు. హోరాహోరీగా జరగనున్న ఈ పోరులో.. ఎవరు విజేతగా నిలుస్తారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
Loan App Harassment: అకౌంట్‌లో డబ్బులు వేయకుండానే.. మహిళకు వేధింపులు
లీగ్ దశలో ఉన్నప్పుడు జీటీ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. తనకు ఎదురైన ప్రతీ జట్టుని మట్టికరిపిస్తూ.. తన ఖాతాలో ఏకంగా 20 పాయింట్లు వేసుకుంది. అంతేకాదు.. తనతో పోటీ పడినా మూడుసార్లు చెన్నై జట్టుకి చిత్తుచిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఈ మూడింటిలోనూ పటిష్టంగా ఉండటం వల్లే జీటీ తిరుగులేని జట్టుకి దూసుకెళ్లింది. కానీ.. ఫ్లేఆఫ్స్‌కి వచ్చేసరికి లెక్కలు కాస్త మారిపోయాయి. అప్పటివరకూ మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నైపై ఆధిపత్యం చెలాయించిన గుజరాత్ జట్టు.. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో మాత్రం ఆ జట్టు చేతిలో ఓడిపోయింది. సీఎక్కే నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జీటీ.. 157 పరుగులకే తట్టాబుట్టా సర్దేసింది. దీంతో.. 15 పరుగుల తేడాతో సీఎస్కే విజయఢంకా మోగించి, నేరుగా ఫైనల్స్‌కు చేరింది.
MLA Kannababu: చంద్రబాబు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి.. బీజేపీకి కన్నుకొడుతున్నాడు
తొలి క్వాలిఫైయర్‌లో సీఎస్కే చేతిలో ఓటమిపాలైన జీటీ.. క్వాలిఫైయర్-2లో ముంబై ఇండియన్స్ జట్టుని భారీ పరుగుల తేడాతో (61) ఓడించి, ఫైనల్స్‌కు చేరుకుంది. క్వాలిఫైయర్-1లో తనని ఓడించినందుకు గాను సీఎస్కేపై ప్రతీకారం తీర్చుకొని.. ఐపీఎల్ టైటిల్‌ని సొంతం చేసుకోవాలని గుజరాత్ భావిస్తోంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెన్నై జట్టుని ఓడించడం అంత సులువు కాదు. మరి, ఈ ఫైనల్‌లో ఎవరు ఎవరిపై ఆధిపత్యం చెలాయిస్తారు? ఐపీఎల్ టైటిల్‌ని ఏ జట్టు సొంతం చేసుకుంటుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!