MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీకి మిస్టర్ కూల్ అనే పేరు ఎందుకు వచ్చిందో.. ఒత్తిడిలోనూ అతడి స్ట్రాటజీలను చూస్తే.. తెలుస్తోంది.. బ్యాట్‌కు పనిచెప్పి.. ఊహించని విధంగా మ్యాచ్‌లను గెలిపించి బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు.. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదలడం ధోనీకే సొంతం.. మిస్టర్ కూల్ కీపింగ్ చేస్తున్నాడంటే.. బ్యాటర్ క్రీజ్ దాటాడా? ఇక మళ్లీ చూడకుండా ఫెవిలియన్ చేరాల్సిందే.. అది ధోనీ పనితనం.. అందుకే ధోని వుంటే.. ఆ మ్యాచే వేరు.. మిస్టర్ కూల్ స్ట్రాటజీలే వేరు అంటారు. ఇదే ధోనికి లాస్ట్ ఐపీఎల్ అనే వార్తలొస్తున్న పరిస్థితుల్లో.. ఫైనల్ మ్యాచ్ మాత్రం ధోని ఐపీఎల్ కెరీర్ లో అద్భుతమైన పతాక సన్నివేశమే. అయితే, ఈ మ్యాచ్ లో ధోని అప్లై చేసిన స్ట్రాటజీలతో మాత్రం గుజరాత్ అల్లాడిపోయింది.
ఈ ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ ఓపెనర్ శుభమన్‌గిల్ తన బ్యాట్‌తో సృష్టించిన విధ్వంసం చిన్నదేం కాదు.. 17మ్యాచ్‌ల్లో గిల్ 890 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. మరే ప్లేయర్ కూడా గిల్ దరిదాపుల్లో లేరు. ఫైనల్లో ఇంకాస్త రాణించి ఉంటే ఓ ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన కోహ్లీ రికార్డును కూడా బద్దలు కొట్టేవాడు. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్‌గా కూడా నిలిచాడు గిల్. అయితే, ఈ ఐపీఎల్‌లో అత్యంత భీకర, విధ్వంసకర బ్యాటర్.. గుజరాత్ అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం.. ఫైనల్లో ఇతన్ని కట్టడి చెయ్యడానికి అస్త్రాలకే అస్త్రంలా పాశుపతాస్త్రం వ్యూహం వేశాడు ధోనీ. గిల్ లేకుండానే గుజరాత్ 214 పరుగుల చేసిందంటే.. ఇక గిల్ వుంటే.. ఆ స్కోరును ఊహించడానికే దారుణంగా వుండేది చెన్నైకి. అలాంటి గిల్ ను అత్యంత త్వరగా పెవిలియన్ కు పంపడంలో ధోని పక్కాగా వ్యవహరించాడు.
ఒక్కసారి క్యాచ్ డ్రాపయితే, ఇక గిల్ ను ఎవరూ ఆపలేరని గత మ్యాచుల చరిత్రే చెబుతోంది. 3 పరుగుల వద్ద గిల్ క్యాచ్ ను దీపక్ చహర్ డ్రాప్ చేయడంతో చెన్నై అభిమానులు కూడా హడలిపోయారు. ఆ తర్వాత గిల్ ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 7 బౌండరీలతో జస్ట్.. 20 బంతుల్లో 39 రన్స్ కొట్టిపారేశాడు. మరో టన్ను బాదేస్తాడా అన్న అనుమానం చెన్నై ఫ్యాన్స్ ను కుదురుగా వుండనివ్వలేదు. గిల్ వెనకాలే వుండే, ధోనికి మాత్రం పక్కాగా స్ట్రాటజీ వుంది. గిల్ దూకుడుగా ఎలా కళ్లెం వెయ్యాలో వ్యూహం వేశాడు. అప్లై చేశాడు. గిల్ కు పెవిలియన్ దారి చూపాడు. కీపర్ గా వికెట్ల వెనకాలా ధోని ఎంత యాక్టివ్ గా వుంటాడో ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లకూ తెలుసు. కానీ, గిల్ మాత్రం మర్చిపోయాడు. ఆద మరిచాడు. అదే పనిగా క్రీజ్ దాటుతున్న గిల్ ను ఒక కంట కనిపెట్టిన ధోని.. ఒక్కసారి వచ్చిన ఛాన్స్ తో గిల్ ను స్టంపౌట్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోని సూపర్ కీపింగ్ కారణంగా గిల్ స్టంపౌట్ అయ్యాడు. మెరుపు వేగంతో ధోని చేసిన స్టంప్.. మ్యాచ్ కే హైలెట్. ఫైనల్ లో కీలక మలుపు కూడా. జడేజా బౌలింగ్ లో రెప్పపాటులో ధోని రియాక్షన్ ఫలితం అది. దటీజ్ ధోనీ.. అనాల్సిందే మరి.
Watched it..still working on believing it! #IPL2023Final #CSKvGT #WhistlePodu #Yellove 🦁💛pic.twitter.com/q6MY0i798b
— Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023