సీఎస్కే బౌలర్లు అందరు విఫలమయినప్పటికీ ఎక్కువ ఫోకస్ మాత్రం తుషార్ దేశ్ పాండే వైపు వెళ్లింది. కేవలం 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చుకుని మూడు వికెట్లు తీశాడు. వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు ఇవ్వడం తుషార్ వీక్ నెస్ గా మారింది. ఇన్సింగ్స్ 16వ ఓవర్ లో తుషార్ దేశ్ పాండే 20 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్థేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకి 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్య ఛేదన కోసం రంగంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారిస్తున్నారు. 10 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన 94 పరుగులు చేసింది.
ఈ ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లోయర్ ఆర్డర్లో వస్తున్న విషయం తెలిసిందే! ఓవైపు అభిమానులు ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తుంటే..