చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటనే కొత్త సారథి పని ఈజీ అవుతుందని తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై సీఎస్కే యాజమాన్యం ఆసక్తికర అప్డేట్ ఇచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.
సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు అని చెప్పింది.
ఐపీఎల్–2024కు రంగం సిద్ధమైంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడబోతుంది.
ఐపీఎల్ లో ఎక్కువ క్రికెట్ అభిమానులు ఉన్న జట్లు ఏవైనా ఉంటే.. అవి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. ఎందుకంటే.. తన అభిమాన కెప్టెన్లు ఉండటం వల్లనే ఆ జట్లకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్ లో చెన్నై, ముంబై మ్యాచ్ ఉందంటే చాలు.. టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. తమ అభిమాన కెప్టెన్లు ఉండటం వల్ల, వారు ఆటలో రచించే వ్యూహాలు అభిమానులకు నచ్చుతాయి కాబట్టి.. ఆ జట్లకు అంతా క్రేజ్ ఉంది.
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐదుసార్లు ట్రోఫీ సాధించిపెట్టిన సారథి ఎంఎస్ ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా.. కొత్త పాత్రలో కనిపించబోతున్నానని కొన్ని రోజుల క్రితమే ధోని పోస్ట్ చేశారు. మరి ఈ సీజన్ లో ధోనీ పూర్తి స్థాయిలో బరిలోకి దిగుతారా లేదా ఇంపాక్ట్ ప్లేయర్ గా…
CSK vs RCB Head To Head IPL Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే. ఏడాది…
MS Dhoni Practices Helicopter Shot Ahead of IPL 2024: ఐపీఎల్ 2024 పండుగ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రమే కాకుండా.. స్టార్ బ్యాటర్…
ఈ కార్యక్రమంలో కింగ్ కోహ్లీ అనుభూతి ఎలా ఉంది అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ప్రేక్షకులు కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేశారు.. తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ మీరంతా ప్రశాంతంగా ఉండండి.. మేము త్వరగా చెన్నైకి వెళ్లాలి.. మీరు ( యాంకర్ ను ఉద్దేశించి ) నన్ను కింగ్ అని పిలిస్తే ఇబ్బందిగా ఉంటుంది.. జస్ట్ విరాట్ అని పిలవండి అని కోహ్లీ పేర్కొన్నారు.