Dhoni-Rahane: మా జట్టులో అదనంగా మరో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లుంది: రుతురాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruturaj Gaikwad Praises MS Dhoni and Ajinkya Rahane’s Fielding: ఎంఎస్ ధోనీ, అజింక్య రహానే వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్రశంసించాడు. ధోనీ, రహానేను చూస్తుంటే జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్టుందన్నాడు. నాణ్యమైన ఫీల్డింగ్ తమకు అదనపు బలం అని రుతురాజ్ పేర్కొన్నాడు. చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లోనూ రాణించిన చెన్నై గుజరాత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ముందుగా బ్యాటింగ్.. ఆపై బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది.
మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ… బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ విభాగాల్లో మా జట్టు అదరగొట్టింది. గుజరాత్ వంటి ప్రత్యర్థిపై ఇలాంటి ప్రదర్శన చాలా అవసరం. చెన్నై పిచ్ ఎప్పుడు ఎలా మారుతుందో మాకు తెలియదు. మొదట బ్యాటింగా? బౌలింగా? అని సంబంధం లేకుండా.. బాగా ఆడాలని భావించాం. ఇక్కడ వికెట్లు చేతిలో ఉంటే చివర్లో దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంటుంది’ అని అన్నాడు.
Also Read
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
- Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
Also Read: Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్‌ను చూశారా?
‘రచిన్ రవీంద్ర పవర్‌ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. దాంతో మేం మంచి రన్ రేట్ సాధించాం. దానినే కొనసాగించాం. శివమ్ దూబె కీలకఇన్నింగ్స్ ఆడాడు. దూబెతో మేనేజ్‌మెంట్, ఎంఎస్ ధోనీ ప్రత్యేకంగా వర్కౌట్ చేశారు. అతడికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. తన పాత్రల గురించి అతనికి బాగా తెలుసు. ఖచ్చితంగా అతను మాకు చాలా ప్లస్ అవుతాడు. ధోనీ, అజింక్య రహానే వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్నారు. మా జట్టులో అదనంగా మరో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లుంది. రహానే ఫీల్డింగ్ నైపుణ్యం గత మ్యాచ్‌లోనూ చూశాం. నాణ్యమైన ఫీల్డింగ్ మాకు అదనపు బలం’ అని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు.
𝗩𝗶𝗻𝘁𝗮𝗴𝗲 𝗠𝗦𝗗 😎
An excellent diving grab behind the stumps and the home crowd erupts in joy💛
Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #CSKvGT pic.twitter.com/n5AlXAw9Zg
— IndianPremierLeague (@IPL) March 26, 2024
Give your hearts to Rahane! He’ll carry it safe! 🧲💛
— Chennai Super Kings (@ChennaiIPL) March 26, 2024
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?