ప్రముఖ నటుడు మోహన్‌లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేర్పంచారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు మందులు వాడుతూ ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది.
టాలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ మాస్టర్ ఒక తమిళ సినిమాకు నేషనల్ అవార్డును దక్కించుకున్నారు. తిరుచిత్రంబళం సినిమాలో మేఘం సాంగ్‌కి గాను జానీ మాస్టర్‌కి నేషనల్ అవార్డు లభించింది.
Murari Re-release: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా.. తన సినిమాలలో భారీ విజయం సాధించిన మురారి సినిమాను రిరిలీజ్ చేసింది చిత్ర బృందం. ఆయన క్రేజ్ ఎలావుందో చెప్పేందుకు ఈ సినిమా రిలీజ్ వసూలను చూస్తే ఇట్లా చెప్పవచ్చు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమా మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మురారి సినిమా…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
Prabhas : కల్కి ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆ ఆనందం నుంచి బయటకు రాకముందే వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి సర్ ప్రైజ్ చేస్తున్నాడు డార్లింగ్.
Devara 2: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు. ఆడియెన్స్, మూవీ లవర్స్ కూడా వెండితెరపై ఎన్టీఆర్ నటనను చూసి ఎంజాయ్ చేయాలని ఎదురు చూస్తున్నారు.
Thangalaan Bookings : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా పీరియాడిక్ మూవీ తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించారు.
Hero Surya : కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కంగువా వంటి విభిన్న కథాంశంతో సూర్య ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయాడు.
Gopi Chand: 2001లో తొలి వలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన గోపీచంద్ నేటితో 23 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించిన గోపీచంద్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి సినిమా తర్వాత జయం, నిజం, వర్షం లాంటి సినిమాలలో నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత 2004లో విడుదలైన యజ్ఞం సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది. ఇక అప్పుడు…
తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తమిళ నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు వెల్లడించింది. అగ్రకథానాయకులు నటించిన ఏ సినిమా అయినా, విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని నిర్ణయించింది.