Hero Suriya Suffer Minor Injury In Movie Shooting: కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కంగువా వంటి విభిన్న కథాంశంతో సూర్య ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయాడు. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ అన్నీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇటీవల సూర్య పుట్టిన రోజు సందర్భంగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య 44 సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ షూటింగులో సూర్యకు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా సినిమా కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ కర్పూర సుందర పాండ్యిన్ వెల్లడించారు.
Read Also:Green Data Center: హైదరాబాద్ లో గ్రీన్ డేటా సెంటర్.. రూ.3350 కోట్ల పెట్టుబడులు..
కంగువా షూటింగ్ పూర్తి చేసుకోవడమే కాకుండా.. తన 44వ ప్రాజెక్ట్ లోకి కూడా హీరో సూర్య ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఒక టైటిల్ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఈ మూవీ వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. అయితే తాజాగా సూర్య ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆయనకు గాయం కూడా అయ్యింది. ఈ వార్త బయటకు వచ్చి ఫ్యాన్స్ ఆందోళన చెందుతుండడంతో.. స్వయంగా ఈ మూవీ కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన అభిమానులకు ధైర్యం చెప్పారు.
Read Also:AP IAS Officers Transfer: ఏపీలో మరో సారి ఐఏఎస్‌ల బదిలీలు..
“డియర్ అన్ బాన ఫ్యాన్స్.. అది చాలా చిన్న గాయం. ఎవరూ కంగారు పడకండి. మీ అందరి ప్రార్థనలు, ఆదరాభిమానాలతో సూర్యా అన్న బాగానే ఉన్నాడు” అంటూ ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండ్యన్ పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సూర్య అన్న త్వరగా కోలుకోవాలి అంటూ ఫ్యాన్స్ ఆకాంక్షించారు. ఈ వార్తతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హీరో సూర్య తన సినిమాలకు ఎలాంటి జాప్యం రాకుండా అభిమానులని అలరించడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇటీవల సూర్య 44 నుండి రిలీజైన గ్లింప్స్ కి నేషనల్ వైడ్ గా సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.