Sivaji-Laya: ఒకప్పుడు హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న శివాజీ-లయ ఇప్పుడు మళ్లీ సందడి చేయబోతున్నారు. గతంలో శివాజీ, లయ కాంబినేషన్‌లో వచ్చిన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. లయ కూడా ఇటీవలే కంబ్యాక్ ఇచ్చి వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శివాజీ, లయ హీరోహీరోయిన్లుగా ఓ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. దర్శకుడికి ఇదే తొలి చిత్రం. శివాజీ ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. శివాజీ సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
Read Also: ATM Theft: 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఏంలను కొల్లగొట్టేశారు..
తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరగగా.. నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్టారు. శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్‌రాజు, దర్శకుడు బోయపాటి శ్రీను చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను అందుకోగా.. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ముహూర్తం షాట్‌కు దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయకపోవడం గమనార్గం. ఆగస్టు 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఇతర తారాగణం వివరాలు ప్రకటించనున్నారు. ఒకప్పటి హిట్ పెయిర్ శివాజీ-లయ మళ్లీ కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.