Ram Charan-Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్ మినహా సరైన అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ నుంచి రాలేదనే చెప్పుకోవాలి. ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు ఎగిరి గంతేసే విషయం బయటకు వచ్చింది.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు షూటింగ్ మెుత్తం పూర్తి కావొచ్చింది. ఇక ఈ సినిమాకు డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని దిల్ రాజు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. దాంతో మెగా ఫ్యాన్స్ డిసెంబర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే .. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ రెండు కాదు.. మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడట.
Read Also:Muppavarapu Venkaiah Naidu: నేతలపై వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా అయితేనే రాజకీయాల్లోకి రండి
గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు అంటూ గతంలో ప్రచారం జరిగింది. అందుకు సంబంధించి మూవీ నుంచి లీక్ అయిన సీన్లే సాక్ష్యాలుగా నిలిచాయి. పొలిటికల్ లీడర్ గా, ఆయన కొడుకుగా చరణ్ రెండు విభిన్నమైన రోల్స్ లో కనిపిస్తాడని అర్థమయింది. అయితే ఇప్పుడు ఇందులో మూడో పాత్రలో కూడా చరణ్ నటిస్తున్నాడన్న వార్త వైరల్ అవుతుంది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
అప్పన్న క్యారెక్టర్లో నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా చరణ్ కపిస్తుండగా.. ఆయన కొడుకు రామ్ నందన్ పాత్రలో మరో రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక కాలేజీలో చదుకునే కొన్ని ఎపిసోడ్లు ఉంటాయి. అప్పుడే కియారా అద్వానీతో ప్రేమలో పడుతాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఐఏఎస్ గా మారిన తర్వాత చరణ్ లుక్ పూర్తిగా మారిపోతుంది. ఇది తెలిసి చరణ్ మూడు పాత్రలు చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ మూవీలో జయరాం, సునీల్, ఎస్ జే సూర్య లాంటి ప్రముఖులు నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.
Read Also:Wayanad Helping : కేరళ సీఎంను కలిసిన సీనియర్ హీరోయిన్స్.. వయనాడ్ బాధితులకు భారీ విరాళం