Mohanlal: ప్రముఖ నటుడు మోహన్‌లాల్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయనకు మందులు వాడుతూ ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు మోహన్‌లాల్ హెల్త్ బులెటిన్‌ను ఆస్పత్రి వర్గాలు విడుదలు చేశాయని.. ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు మోహన్‌లాల్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది. షూటింగ్స్‌కు కొన్ని రోజుల పాటు వైద్యులు సూచించారు.
Read Also: Jani Master: నేషనల్ అవార్డు సాధించిన జానీ మాస్టర్‌కు సన్మానం
ఇక మోహన్‌లాల్ సినిమాల విషయానికొస్తే.. తన కొత్త సినిమాలు ‘ఎల్2’, ‘బరోజ్’ పనుల్లో మోహన్‌లాల్ బిజీగా ఉన్నారు. షూటింగ్‌లో భాగం మోహన్‌లాల్ గుజరాత్‌కు వెళ్లగా.. అక్కడే అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన కొచ్చీకి వచ్చినట్లు సినీవర్గాల సమాచారం. మోహన్‌లాల్ నటిస్తున్న ‘బరోజ్’ అక్టోబరు 2న విడుదల కానుంది. బరోజ్ మూవీకి స్వయంగా మోహన్‌లాల్ దర్శకత్వం వహిస్తు్న్నారు. ప్రస్తుతం ‘ఎల్2: ఎంపురన్’ చిత్రంలో నటిస్తున్నారు.