Prabhas, Hanu Raghavapudi Movie Update: కల్కి ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆ ఆనందం నుంచి బయటకు రాకముందే వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టి సర్ ప్రైజ్ చేస్తున్నాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్-2 , కల్కి-2 , స్పిరిట్ , రాజాసాబ్ ఇలా అన్ని భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీనితో ఈ సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ , హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విధితమే. ఇప్పటికే ఈ కాంబో కి సంబంధించి అడపా దడపా ఏదో ఒక అప్ డేట్స్ ప్రేక్షకుల సినిమాపై క్యూరియాసిటీని పెంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది. అదేంటో చూద్దాం..
Read Also:Minister Vasamsetti Subhash: ఒక్క ఫ్యాక్టరీ రాలేదు.. 8 ఫ్యాక్టరీలు రాష్ట్రాన్ని వీడాయి..!
వైజయంతి మూవీస్ బ్యానర్ లో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో.. హను రాఘవపూడి, ప్రభాస్ సినిమా రాబోతుంది. హనురాఘవపూడి గత సినిమాల్లోని కథ , మేకింగ్ నటి నటులను చూపించే తీరు ఇలా ప్రతిదీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే.. ప్రేక్షకులకు ఈసారి అంతకుమించిన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు ‘ఫౌజి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన కథ కూడా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆగస్టు 17న హైదరాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానుంది. మూడు వారాల పాటు మధురైలో జరగనుంది. మూడు వారాల పాటు జరగనున్న ఈ మూవీ షూటింగ్‌లో ప్రభాస్ 10 రోజులు పాల్గొనునన్నాడని తెలుస్తోంది. ఆగస్టు 22 నుంచి ఆయన షూటింగ్ జాయిన్ కానున్నాడట.
Read Also:Funny Thief in Siddipet: అంబులెన్స్ దొంగలించిన దొంగ.. అరగంటలో యాక్సిడెంట్ ఆసుపత్రికి
పైగా ప్రభాస్ అభిమానులను సంతోషపరిచే ఇంకొక న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ కు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని.. దాదాపు వచ్చే ఏడాది చివరికి.. ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సినీ సర్కిల్ లో టాక్. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ కొట్టేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.