నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెడతారని తెలిసింది.
డైరెక్టర్ సందీప్ వంగ తన హీరోలను అంతకు మించి అనేలా చూపిస్తుంటాడు. స్పిరిట్ సినిమాలో ఇప్పటివరకు చూడని ప్రభాస్‌ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్‌ను ఇంకే రేంజ్‌లో ప్రజెంట్ చేస్తాడనే ఆసక్తి అందరిలోను ఉంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేస్తారనే రూమర్ తాజాగా బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం ఆయన రెండు పాత్రలను రాశారట.
సాయిదుర్గ తేజ్ ఇటీవల ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ తాజా చిత్రం 'ఉషా పరిణయం; ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ చిత్రంలో తన్వి ఆకాంక్షతో పాటు దర్శకుడి కుమారుడు శ్రీ కమల్ నటించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సాయిదుర్గ తేజ్ తన మొదటి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు.
తమిళ్ రాకర్స్ భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన పైరేట్ వెబ్‌సైట్‌లలో ఒకటి. చాలా సినిమాల పైరసీ ప్రింట్లు విడుదల రోజునే తమిళ్ రాకర్స్‌లో వచ్చాయి. ఈ పైరేట్ వెబ్‌సైట్ కారణంగా అనేక సినిమాలు ఆర్థిక నష్టాలను చవిచూశాయి. ఇంతలో ధనుష్ హీరోగా తాజాగా విడుదలైన రాయన్ పైరేటెడ్ వెర్షన్‌ను అప్‌లోడ్ చేస్తూ మధురైకి చెందిన జెబ్ స్టీఫెన్ రాజ్ పట్టుబడ్డాడు.
Bellamkonda Sreenivas: బెల్లకొండ శ్రీనివాస్.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనదైన మాస్ యాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో సినీ అభిమానులకు బెల్లంకొండ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. సందర్బంగా.. బెల్లకొండ శ్రీనివాస్ అంధుల పాఠశాలకు వెళ్లి వారికి అక్కడ భోజనం, బట్టలను అందించి మంచి మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమంకు సంబంధించిన ఫోటోలను ఆయన తన…
Mr Bachchan Release on August 15: దర్శకుడు హరీష్ శంకర్, హీరో మాస్ మహారాజా రవితేజతో కలిసి చేసిన మూడో చిత్రం “మిస్టర్ బచ్చన్”. ఈ సినిమా బాలీవుడ్ లో వచ్చిన ‘రైడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. ప్రస్తుతం సినిమా బృందం ఈ సినిమా రిలీజ్ తేదీని తాజాగా ఖరారు చేసింది. ఆగస్టు 15 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను…
Ester Noronha: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కోసం చాలామంది క్యాస్టింగ్ కౌచ్ లో ఇబ్బంది పడ్డామని ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తెలిపిన సందర్భాలు అనేకం. ఇదే వరుసలో తాజాగా మరో హీరోయిన్ చేరింది. తాజాగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఎస్తేర్ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఆవిడ క్యాస్టింగ్ కౌచ్ పై కాస్త బోల్డ్ కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆమెతో జరిగిన ఓ సినీ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ సంబంధించిన…