వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన రాబోయే చిత్రం 'రాజాసాబ్'లో విభిన్నమైన శైలిలో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధంగా ఉన్నాడు. 400 కోట్ల బడ్జెట్‌తో రొమాంటిక్ హారర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
Saripodhaa Sanivaaram: దర్శకుడు వివేక్ ఆత్రేయ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వచ్చిన ‘సరిపోదా శనివారం’ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆనందం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్క్‌ను బద్దలు కొట్టి గొప్ప బాక్సాఫీస్ మైలురాయిని సాధించింది. ఈ చిత్రం అన్ని చోట్లా విజయవంతంగా దూసుకుపోతూనే ఉంది. మూడవ వారాంతంలో కూడా థియేటర్లలో తన హవాను కొనసాగిస్తోంది. నాని మరో అద్భుతమైన నటనతో…
స్టార్ నటుడు కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ధీరన్ అధిగారం ఒండ్రు, అరువి, ఖైదీ, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రాబోతోంది. అద్భుతమైన కథలతో, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో హీరో కార్తీ ప్రేక్షకులని అలరిస్తున్నారు.
కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హిట్టు కొట్టారు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు థియేటర్లో, ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతుంది. కొన్ని సార్లు థియేటర్లో మిస్ అయిన చిత్రాలకు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంటుంది. ప్రస్తుతం చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఓటీటీలో దూసుకెళ్తోంది.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)-2024 వేడుక దుబాయి వేదికగా అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'భగవంత్ కేసరి' నిలిచింది. గతేడాది బాలయ్య నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం భగవంత్ కేసరి సూపర్ హిట్‌గా నిలిచింది.
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో.
సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలు విడుదలకు ముందే ట్రెండ్ అవుతాయి.
Kushi Sequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్ భూమిక జంటగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా తమిళంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో హీరో విజయ్, జ్యోతిక కలిసి నటించారు. ఆ సినిమానే తెలుగులో రీ మేకింగ్ గా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులో భారీ విజయం సాధించింది. నిజానికి ఏ సినిమా అయినా సరే రీమేక్ చేస్తే.. ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫీల్ పోతుందని భావిస్తారు. అయితే ఖుషి…