Thangalaan Bookings : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా పీరియాడిక్ మూవీ తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అదే విషయాన్ని చిత్ర మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
చిత్ర బృందం పలు కీలక ప్రాంతాలను సందర్శిస్తూ, సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో విక్రమ్‌ని తంగలాన్‌కి సీక్వెల్ చేస్తారా అని ప్రశ్నించారు. దానికి విక్రమ్ బదులిస్తూ, ప్రీక్వెల్ లేదా సీక్వెల్ చేయడానికి స్కోప్ ఉంది. తర్వాతి భాగాన్ని తప్పకుండా చేస్తామన్నారు. చాలా కథాంశాలు దానితో ముడిపడి ఉన్నందున నాలుగు భాగాలు కూడా తీయవచ్చు. నేను జోక్ చేయడం లేదు. రాబోయే చిత్రాలకు కథలు భిన్నంగా ఉంటాయి. ఇతర భాగాలకు కథానాయకుడి లుక్, దుస్తులు భిన్నంగా ఉంటాయి అని విక్రమ్ అన్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది.
Read Also:Manish Sisodia: మనీష్ సిసోడియా మళ్లీ డిప్యూటీ సీఎం కాగలరా?