హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్ట ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోడిపందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోడిపందేలు జరిగిన ల్యాండ్ శ్రీనివాస్‌కి చెందినదిగా నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసిన పోలీసులు.. కోడిపందేల నిర్వహణపై సమగ్ర వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తోల్కట్ట గ్రామం సర్వే నెంబర్ 165/aపై నాలుగు రోజుల్లో ఆధారాలతో తమ ముందు హాజరుకావాలని పోలీసులు ఆయనకు…
హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టు రట్టయింది. క్యాసినో, కోడిపందేలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోడిపందేలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అరెస్ట్ చేశారు. ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం…
హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టు రట్టయింది. క్యాసినో, కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకోగా.. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు క్యాసినో, కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మొయినాబాద్ తోల్కట్టలోని…
Kishan Reddy: ఇంద్ర కరణ్ రెడ్డి గెలిచింది ఎక్కడ? మంత్రి అయింది ఎక్కడ? బ్రోకరీజం చేసింది ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో స్పందించిన ఆయన నాంపల్లి పార్టీకార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా? ప్రగతి భవన్ నుండి వచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్‌ఎస్ పెద్ద కుట్ర చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.…
ఆ.. రెండు ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు 6గంటలకే వెళ్లి అక్కడ వున్నారు. పోలీస్ అధికారి ముందే వెళ్లి వచ్చారు. ముందే రికార్డు చేసి పెట్టుకున్నారు. స్వామిని కూడా వదిలిపెట్టరా? ఎందుకు ముఖ్యమంత్రికి హిందువులంటే అంత కోపం అంటూ ఆరోపించారు.