Bandi Sanjay: ఆ ఫాంహౌస్ ఎపిసోడ్ ఓ డ్రామా.. చార్జ్‌షీట్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Released Chargesheet On TRS Rule: మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ అంతా ఒక డ్రామా అని.. బీజేపీకి చెందిన నేతలని చెప్తున్న ఆ ముగ్గురు వ్యక్తులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. నిజానికి.. ఆ ముగ్గురు వ్యక్తులకు కేసీఆర్ కుటుంబంతోనే సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. ఆ ఫాంహౌస్ టీఆర్ఎస్‌దేనని, అక్కడున్నది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని, డబ్బులు ఇవ్వడానికి ఆ ఫాంహౌస్‌కి వెళ్లిన ముగ్గురికీ టీఆర్ఎస్‌తో లింక్‌లు ఉన్నాయని, ఫిర్యాదు చేసింది కూడా టీఆర్ఎస్ వాళ్లేనని అన్నారు. ఈ తతంగంలో పోలీస్ కమిషనర్ హస్తం కూడా ఉందని ఆరోపించారు. కేవలం మునుగోడు ఉప ఎన్నికల కోసం ఇదంతా అవసరమా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై తాము హైకోర్టుని ఆశ్రయిస్తామని, సీబీఐ విచారణ కూడా జరగాల్సిందేనని డిమాండ్ చేశఆరు.
ఇదే సమయంలో టీఆర్ఎస్ పాలనపై బండి సంజయ్ చార్జ్‌షీట్ విడుదల చేశారు. ఎన్నికల్లో గెలవడానికి టీఆర్‌ఎస్ డ్రామాలాడుతోందని.. పోటీ చేసే అభ్యర్థి ఏం చేశారు? ఏం చేయబోతున్నారు? అనేది మాట్లాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మూర్ఖత్వంగా సాగిస్తున్న కేసీఆర్ పాలన అంతం చేసేందుకే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారన్నారు. ఇప్పటివరకూ మునుగోడును అభివృద్ధి చేయలేదని, కనీసం అవసరాలు కూడా తీర్చలేదని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తే.. ఆయన్ను అసెంబ్లీ నుంచి బయటకు గెంటేశారన్నారు. కేసీఆర్ బీజేపీని, ప్రధాని మోడీని తిట్టడమే పని పెట్టుకున్నారన్నారు. మనుగోడు ప్రజల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ తాము ముందుకు పోతున్నామని తెలిపారు. ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక అని.. మునుగోడు ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే తాము ఈ చార్జ్‌షీట్ విడుదల చేశామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!