Kishan Reddy: ఇంద్ర కరణ్ రెడ్డి గెలిచింది ఎక్కడ? మంత్రి అయింది ఎక్కడ? బ్రోకరీజం చేసింది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఇంద్ర కరణ్ రెడ్డి గెలిచింది ఎక్కడ? మంత్రి అయింది ఎక్కడ? బ్రోకరీజం చేసింది ఎవరు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో స్పందించిన ఆయన నాంపల్లి పార్టీకార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా? ప్రగతి భవన్ నుండి వచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్‌ఎస్ పెద్ద కుట్ర చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఓటమి కళ్ళ ముందు కన్పించడంతో కొత్త ఆటకు తెర లేపారని ఆరోపించారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫార్మ్ హౌస్ లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించేందుకు వందల కోట్లు వారికి ఇవ్వడం కోసం బీజేపీ కుట్ర, నేరం చేసిందని రాత్రికి రాత్రి ప్రధాని దిష్టిబొమ్మలను మంత్రులు మునుగోడులో తగల బెట్టారని మండిపడ్డారు. డబ్బు, కాంట్రాక్ట్, పదవులు ఆశ పెట్టారని రాత్రికి రాత్రి పెద్ద డ్రామా ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాశ కాలే విపరీత బుద్ది… TRS పార్టీ గురువిండ సామెతల వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటేడ్ అంటూ ఆరోపించారు. మునుగోడు ప్రజలు తమ వైపు లేరని వింత నాటకాలకు, కొత్త డ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. దొరికిందని చెబుతున్న డబ్బు ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా ప్రగతి భవన్ నుండి వచ్చిందా బయట పెట్టలేదు ఇప్పటి వరకు అంటూ ప్రశ్నించారు.
Read also: Kishan Reddy: డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్.. ప్రగతి భవన్ నుండి వచ్చిందా..
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
తెలంగాణలో పిరయింపులను ప్రోత్సహించి, పెద్ద పీట వేసి మంత్రి పదవులు ఇచ్చింది టీఆర్‌ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబమే అని తెలిపారు. అనేక మంది ఎమ్మెల్యేలను రాజీనామ చేయించకుందా పార్టీ లో చేర్చుకుంది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. ఇంద్ర కరణ్ రెడ్డి గెలిచింది ఎక్కడ మంత్రి అయింది ఎక్కడ… బ్రోకరీజం చేసింది ఎవరు? అంటూ మండిపడ్డారు. ఎక్కడైన నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అనేక మంది నీ, బెదిరించి పార్టీ లో చేర్చుకుంది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టడం, రాజకీయంగా బ్లాక్ మైల్ చేయడం, అనేక మందిని బెదిరించి మీరు పార్టీలో చేర్చుకున్నా మీరు. చాలామందికి ఎమ్మెల్సీ, ఎంపీ, ఛైర్మెన్లు, మంత్రి పదవులు చేస్తామని చెప్పి ఇలాంటి ఫిరాయింపులకు పెద్దపీఠ వేసింది సీఎం కేసీఆర్ అని కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్టీలను ముంచిన చరిత్ర ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ నే అంటూ మండిపడ్డారు. వైఎస్ ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకుని ఆపార్టీని ముంచిన చరిత్ర మీది కాదా? అంటూ ప్రశ్నించారు. సీపీఐ పార్టీ ఏకైక ఎమ్మెల్యే వుంటే మీరు చేర్చుకుని శాసనసభలో సీపీఐ పార్టీ గొంతు నరికింది మీరే అని మండిపడ్డారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికం మీద టీఆర్ఎస్ పార్టీ చేర్చుకుంది అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాబోతున్నానని పగటి కలలు కంటున్న ముఖ్యమంత్రి ముద్దుల కుమారుడు మునుగోడులో ఒక బీజేపీ నాయకుడిని ఫోన్ చేసి బీజేపీ ఏముంది టీఆర్‌ఎస్ లో చేరమని అడిగలేదా? అంటూ ప్రశ్నించారు. అదైతే నైతికతనా? అంటూ మండిపడ్డారు కిషన్ రెడ్డి. అది పోలీసులకు కనిపించలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలిసినా పోలీసులు దాడులు చేయాలేదు. సోషల్ మీడియాలో ఆవార్త ప్రసారం జరిగినా అప్పుడు పోలీసులు ఏం చేశారని నిలదీశారు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!