చండూరు ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ బీజేపీ నేతలపై మండిపడ్డారు. కేసీఆర్ వత్తిడిలో వున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ సభ అనంతరం బీజేపీ నేతలు కౌంటర్ ప్రెస్ మీట్లలో టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2018 లో ఇచ్చిన హామీలు ఏమైనాయి ఈ ఎన్నికల్లో గెలిస్తే 15 రోజులు పూర్తి చేస్తాను ఎలా చెప్తారు సీఎం చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారు. ఏ కులాల అంశం ఎందుకు మాట్లాడలేదు చివర్లో చేనేత కార్మికుల గురించి మాట్లాడిన సీఎం గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదన్నారు బండి సంజయ్.
Read Also: Venkatesh Netha: బీజేపీ డ్రామాల పార్టీ.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారు
శివన్న గూడెం ప్రాజెక్టును కేంద్రం ఆపిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కేంద్రమే ఆపితే ఏడాదిలో ఎలా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తారు ఇప్పుడు కేంద్రం అనుమతి ఇస్తారా మరి. నువ్వు ఇన్చార్జి తీసుకున్న గ్రామానికె నువ్వు పోలేదన్నారు బండి సంజయ్. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి గొప్పలు చెప్తున్నా సీఎం నువ్వు ఇన్చార్జి తీసుకున్న గ్రామంలోని మీ పార్టీ నేతలు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తే ఈ ఆరో ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేశారు. అమ్ముడు పోయేటోడు కూడా ఆణిముత్యాలేనా? ఈ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు దాచిపెడుతున్నావ్? విచారణకు ఎందుకు భయపడుతున్నావ్? ఇన్ని రోజులు వడ్లు నేనే కొంటున్నా అని రైతులను మోసం చేశావు. నిజానికి వడ్లు కొంటున్నది బిజెపి కేంద్ర ప్రభుత్వం. మేం రైతులు పండించిన వడ్లు కొంటే మీరు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నావు అన్నారు బండి సంజయ్.
Read Also: Venkaiah Naidu: షేర్ అండ్ కేర్ అనేదే మన భారతీయ తత్వం
మోటార్లకు మీటర్లు ఎక్కడ పెట్టినం దుబ్బాకలో పెట్టామా? హుజురాబాద్ లో పెట్టామా.. ఎక్కడ పెట్టాం మీటర్లు.. రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఎన్నికల తర్వాత మళ్లీ కరెంట్ చార్జీ పెంచబోతుంది. డిస్కంలో నష్టాల్లో ఉన్నాయి డిస్కంలో నష్టాలు ఉండడానికి కారణం ఎవరు? కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు మనసు వేదనతో ఉన్నారు. మీ నాయకులు మీ ఆత్మగౌరాన్ని కెసిఆర్ కాళ్ళ దగ్గర పెట్టారు మీరే ఆలోచించుకోండి. కెసిఆర్ కు కమ్యూనిస్టు పార్టీ నేతలు ఎందుకు మద్దతిస్తున్నారు?డబుల్ బెడ్ రూమ్ల ఇండ్ల హామీ నెరవేర్చారా?
మీరు ఉద్యమం చేస్తున్న అంశాల్లో ఏవి సీఎం కేసీఆర్ నెరవేర్చారు? ఏమి నెరవేర్చకుండానే టీఆర్ఎస్ కి కమ్యూనిస్టు పార్టీ అగ్ర నేతలు ఎందుకు మద్దతిస్తున్నారు. ఎంతకు అమ్ముడుపోయారు కమ్యూనిస్టు నాయకులు అని బండి సంజయ్ అన్నారు. కమ్యూనిస్టు నేతలు ఆ పార్టీ కార్యకర్తలకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. చివరకు ‘‘సూడు సూడు నల్లగొండ… గుండెపైన ఫ్లోరైడ్ బండ’’ నేనే రాసినని సిగ్గు లేకుండా కేసీఆర్ చెప్పుకుండు.. ఆ పాట రాసింది కోదాటి శ్రీను… అయినా సిగ్గు, శరం లేకుండా నేనే రాసినని అబద్దాలు చెప్పిండన్నారు.