Moinabad Farm House: ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ.. 64 మంది అరెస్ట్!
- ఫామ్‌హౌస్‌లో క్యాసినో గుట్టు రట్టు
- 64 మంది, 55 లగ్జరీ కార్లు స్వాధీనం
- క్యాసినోలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టు రట్టయింది. క్యాసినో, కోడి పందాలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల పందాలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అదుపులోకి తీసుకోగా.. ఇందులో ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్ కూడా ఉన్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రముఖులు క్యాసినో, కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
మొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్‌హౌస్‌పై దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించేశారు. యూపీఐ ట్రాన్సక్షన్ల కోసం ఆర్గనైజర్లు స్కానర్లు వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. యూపీఐ ద్వారా భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. క్యాసినో, కోడిపందేల కోసం ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు. కోడిపందేల్లో విడతల వారీగా 200 మంది దాకా పాల్గొన్నట్టు సమాచారం. కోడిపందేలు, క్యాసినోలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు?, ఎంత కాలంగా క్యాసినోజరుగుతుంది అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!