మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి మరణం పట్ల బీజేపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు. మా అందరికీ మార్గదర్శకుడు మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి మరణం బాధాకరం. జంగారెడ్డి మరణంపట్ల బీజేపీ రాష్ట్ర శాఖ పక్షాన సంతాపం వ్యక్తం చేస్తున్నా అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జంగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, అట్లాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నిర్మొహమాటంగా, ధైర్యంగా మాట్లాడే వ్యక్తి……
మోడీ బడ్జెట్ తో దేశానికి మేలు జరగదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వేటికి ప్రధాన్యత లేదని, కేసీఆర్ ప్రెస్ మీట్ లో మర్యాద లేదని ఆయన అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి నందుకు రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని, ఎరువుల సబ్సిడీ తగ్గించారు.పంటలకు మద్దతు ధర…
1.కేంద్ర బడ్జెట్ పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బడ్జెట్లో తెలంగాణకు మొండిచెయ్యి చూపారని, మెట్రో రైలు కు నిధులు అడిగాం ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టులకు జాతీయ హోదా కోరినా పట్టించుకోలేదన్నారు. మిషన్ భగీరథ కు ఫండ్స్ అడిగినా ఇవ్వకపోవడం దారుణం అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఈ దేశంలో లేదన్నట్టు వ్యవహరించారు. ప్రగతి శీల రాష్ట్రాలకు ఇలాగేనా చేసేది అని కేటీఆర్ ప్రశ్నించారు. 2.కేంద్ర బడ్జెట్ దేశానికి మేలుచేసేలా లేదన్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. రైతులకు…
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నేతలు నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన హామీలు ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదు.ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, మెట్రోరైలు వంటివి ప్రస్తావనే లేదన్నారు సీపీఎం నేతలు. కేంద్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఐ నేతలు నిరసన తెలిపారు. బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం చెందారు. విశాఖ సీపీఐ కార్యాలయం నుంచి…
కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లేవన్నారు. కనీసం ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆయినా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ కు స్పెషల్ ఇండస్ట్రియల్ రాయితీలు అందించాలి.తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్ట్ పార్క్, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదు. ప్రధానమంత్రి మోదీ పదే పదే సబ్…
ఇవాళ్టి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్లో ఉభయ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఆయనకు ఇదే ఆఖరి ప్రసంగం అవుతుంది. రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన అరగంట తర్వాత లోక్సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభ…
ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ (1954) సవరణ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ 1954 ప్రతిపాదిత సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సవరణలు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ ల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర…
హైదరాబాద్ శంషాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమం మహాకార్యానికి వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో సమతామూర్తి పేరిట నిర్మించిన 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. చినజీయర్ స్వామిని కలిశారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ దివ్యసాకేతానికి వెళ్లారు శివరాజ్ సింగ్ చౌహాన్. కుటుంబసభ్యులతో కలిసి చినజీయర్ స్వామి ఆశ్రమంలో ప్రతిష్ఠాత్మకంగా…
యూపీలో ఎన్నికలు సూరత్ వ్యాపారులకు బంగారుపంట పండిస్తోంది. ఎన్నికలంటే ప్రచార హోురు. కానీ కరోనా పుణ్యమాని దేశంలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారీ బహిరంగ సభలకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో పార్టీలు వేరే దారులు వెతుకుతున్నాయి. యూపీ ఎన్నికలలో ప్రచారం కరోనా కారణంగా తగ్గిపోయింది. ఎన్నికలలో తమ తరఫున ప్రచారం చేసే మహిళలకు చీరలు పంచాలని నిర్ణయించింది. సూరత్ లోని వ్యాపారులకు 3 డీ ప్రింటింగ్ చీరలకు ఆర్డర్లు వచ్చాయి. సూరత్ లోని బట్టల…