తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రధానిని విమర్శించొద్దు అన్న కేసీఆర్ ఇప్పుడు అదే ప్రధాని పైన నీచాటినీచంగా మాట్లాడుతున్నారన్నారు. 1985 నుండి 2018 వరకు ఒక్కసారి ఓడిపోని వ్యక్తికి పీకే అవసరం ఎందుకు వచ్చిందన్నారు.
ప్రజల నాడీ తెలియదా… నా కుట్రలు కుతంత్రాలు నడవడం లేదని.. పీకేను తెచ్చుకున్నారు. పీకే కన్నా మేధావులు తెలంగాణ ప్రజలు.దుబ్బాకలో బీజేపీ గెలిచింది, హుజూరా బాద్ లో బీజేపీ గెలిచింది మోటర్లకు మీటర్లు రాలేదు… రేపు బీజేపీ గెలుస్తుంది మీటర్లు రావు. నాయి బ్రహ్మణులకు, రజకులకు ఇచ్చే సబ్సిడీ ఎందుకు ఆగిపోతుంది… ఇంత చిల్లరనా… ఇన్ని అబద్ధాలా…ముఖ్యమంత్రి గారూ అని ఎద్దేవా చేశారు.
దళిత బస్తీల్లో కరెంట్ కట్ చేస్తున్నారు… బాధ్యులు ఎవరో సీఎం చెప్పాలి. డిపాజిట్స్ మళ్ళీ వసూలు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న నాయి బ్రాహ్మణులకు ,రజకులకు రాయితీ ఇవ్వాలి. రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదన్నారు ఈటల. ధాన్యం విసయంలో కేసీఆర్ ఎలా అభాసు పాలయ్యారో… మీటర్లు, నాయి బ్రాహ్మణులు, రజకుల విషయము లో అభాసు కాక తప్పదన్నారు. డిస్కమ్ లు దివాళా తీశాయి… ప్రభాకర్ రావు తట్టుకోలేక పారిపోయారు.
అన్ని విషయాలు ప్రజలకి అర్థం అవుతున్నాయని ఎదురు దాడి సీఎం మొదలు పెట్టారు. కేసీఆర్ గురువింద గింజ. పీకే గికేలు తెలంగాణలో పనిచేయవు. మోడీ తో కేసీఆర్ కి పోలికనా? ప్రజల ప్రేమను, ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే సత్తాను కేసీఆర్ కోల్పోయారు. మంత్రులని ,ఎమ్మెల్యే లను జీవశ్చవాల్లా మార్చాడని విమర్శించారు ఈటల రాజేందర్.