ఉక్రెయిన్ -రష్యా యుద్ధంతో అక్కడ వున్న విదేశీ విద్యార్ధులు, పౌరులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న ఆంధ్ర విద్యార్థులకు తల్లిదండ్రులకు వర్చవల్ గా ధైర్యం, జాగ్రత్తలు చెబుతూ భారత దేశానికీ మరింత వేగంగా వెనక్కి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ . ప్రోగ్రాంలో నిర్వాహకులు, ముఖ్య నాయకులు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్, ఎంపీ జీవీల్ నరసింహారావు, బీజేపీ…
కేంద్రం రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉంది, యాసంగి వడ్లను రాష్ట్రం కొనాల్సిందే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రం యాసంగికి సంబంధించి రా రైస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రం ఎందుకు వడ్లను కొనం అంటోందని బండి సంజయ్ ప్రశ్నించారు. కామారెడ్డి లోని పర్ణికా హోటల్ లో జరిగిన బీజేపీ జోనల్ సమావేశంలో పార్టీ జాతీయ సహా కార్యనిర్వాహక కార్యదర్శి శివప్రకాశ్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశా నిర్దేశం…
ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న కొంత మంది విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడామని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్. అక్కడ సుమారు 4 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం. నోడల్ అధికారిగా రవి శంకర్ 9871999055. ఏపీ భవన్. అంతర్జాతీయ…
2023 కి ముందే దేశంలో మరో ఫ్రంట్ రాబోతోందా? తెలంగాణ దానికి వేదిక కాబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో వున్నారు. వీరందరి సమావేశానికి ముహూర్తం ఖరారైందా ? అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రాంతీయ పార్టీల భేటీ జరిగే అవకాశం ఉందా ? ప్రాంతీయ పార్టీల సమావేశంకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోందా ? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్…
దేశంలో రాజకీయాల గతిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీ నిరంకుశ విధానాలు, ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై వివిధ రాష్ట్రాల సీఎంల మద్దతు కూడగడుతున్నారు కేసీఆర్. తన పోరును జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే…
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ద్రోహం జరిగిందంటూ వామపక్ష పార్టీల రాష్ట్ర సదస్సులో వక్తలు పేర్కొన్నారు. సదస్సుకు హాజరైన పది వామపక్ష పార్టీలకు చెందిన నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏపీకి కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది. ఈ నెల 21వ తేదీన ప్రధాని విశాఖకు వస్తారని అంటున్నారు.. ఆ రోజున విశాఖ రైల్వై జోన్.. ప్రత్యేక హోదాల మీద ప్రధాని ప్రకటనలు చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించబోమని హామీ ఇవ్వాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు.…
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్.. మళ్లీ రాష్ట్రాల పర్యటన మొదలుపెట్టనున్నారు. ఈనెల 20న ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంతో సమావేశం కానున్నారు. త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం సన్నాహాలు జరుగుతుండగా.. మాజీ ప్రధాని దేవెగౌడను కూడా భేటీకానున్నారు. మహారాష్ట్ర సియం ఉద్దవ్ థాకరే టిఆర్ఎస్ అధినేత కేసియార్కు ఫోన్ చేశారు. ఈనెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. బిజెపికి వ్యతరేకంగా కేసియార్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫెడరల్ స్ఫూర్తి కోసం ప్రజా వ్యతిరేక విధానాలను…
తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. ప్రధానిని విమర్శించొద్దు అన్న కేసీఆర్ ఇప్పుడు అదే ప్రధాని పైన నీచాటినీచంగా మాట్లాడుతున్నారన్నారు. 1985 నుండి 2018 వరకు ఒక్కసారి ఓడిపోని వ్యక్తికి పీకే అవసరం ఎందుకు వచ్చిందన్నారు. ప్రజల నాడీ తెలియదా… నా కుట్రలు కుతంత్రాలు నడవడం లేదని.. పీకేను తెచ్చుకున్నారు. పీకే కన్నా మేధావులు తెలంగాణ ప్రజలు.దుబ్బాకలో బీజేపీ గెలిచింది, హుజూరా…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య సర్జికల్ స్ట్రయిక్స్ విషయంలో మాటల యుద్ధం జరుగుతోంది. సర్జికల్ స్ట్రైక్ జరిగినట్లు సాక్షాలు కావాలా? అసలు నువ్వు భారతీయుడివా? అంటూ నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ సరిహద్దుల గురించి మాట్లాడిన తీరును డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై ఆమె ప్రకటన విడుదల చేశారు. జాతీయ మీడియాలో ప్రచారం కోసం భారత ఆర్మీ విశ్వసనీయత దెబ్బతీసేలా కేసీఆర్ మాట్లాడడం…
దేశంలో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇవాళ యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో పోలింగ్ జరగనుంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఓటమి కి కాంగ్రెస్ పార్టీ యే ప్రధాన కారణం అవుతుందన్నారు. యోగి-మోడీ వటవృక్షాన్ని యూపీలో కదిలించింది ప్రియాంక గాంధీ. బీజేపీ వటవృక్షం పడిపోక తప్పదన్నారు హరీష్ రావత్. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలను హరీష్…