తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటల దగ్గర పిల్లలు, పెద్దల కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. భోగి మంటల వద్ద చిన్నారులు కోలాటలతో ఆడిపాడారు. హరిదాసుల కీర్తనలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తాజా ప్రధాని మోడీ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోడీ ఈరోజు దేశంలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా హాజరయ్యారు. దేశంలో థర్డ్ వేవ్ దృష్ట్రా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చిస్తున్నారు. వ్యాక్సినేషన్ పైకూడా ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. అయితే, ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కాలేదు. ఆయన…
రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని ఆయన అన్నారు. దేశంలో రైతులను బీజేపీ బతకనిచ్చేలా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎరువుల ధరలు పెంచుతూ.. రైతుల ఆదాయం పెంచుతామన్న కేంద్రం ఖర్చులు రెట్టింపు చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఎరువుల ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కరెంట్ మోటర్లతో బిల్లులు వసూలు చేయడం, ధాన్యం కొనకుండా ఎరువుల…
చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దని, అలా వస్తే మీరు దేశద్రోహులే అవుతారని ప్రధాని మోడీని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్, మోడీ దేశభక్తి నేతి బీరకాయలో నేతి అంత అని ఆయన ఎద్దేవా చేశారు. Read Also: పాల్వంచ ఘటన..రామకృష్ణ తల్లి, సోదరి అరెస్టు బీజేపీ నేతలు మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెబుతారని,…
ఆ ముగ్గురు బీజేపీ నేతలు ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. అంతా ఒకే సామాజికవర్గం నేతలు కావడంతో పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయట. ఒకవైపు బీజేపీ దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. పత్తా లేకుండా పోయిన వారి గురించి నిఘావర్గాలు ఆరా తీశాయట. ఇంతకీ ఎవరా నాయకులు? పార్టీ ఆఫీస్‌కూ రావడం లేదని ఆరా..?తెలంగాణలో బీజేపీ నాయకులు వరసగా ఆందోళనలు నిర్వహిస్తూ రోడ్లపైనే ఉంటున్నారు. జాగరణ దీక్ష చేపట్టిన పార్టీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంతో…
తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ కి రాజకీయ ప్రయోజనాల కంటే..రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు. కెసిఆర్ రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థ కి కేంద్రం ఆమోదం తో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది. జీఓ 317తో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీఓ ఉందన్నారు రేవంత్.…
దేశంలో కరోనా భయం వీడలేదు. కనిపించని శత్రువు సవాల్ విసురుతోంది. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో… కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీ, దివ్యాంగ ఉద్యోగులకు విధులకు హాజరుకాకుండా మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. వారికి ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇచ్చారు. కోవిడ్ కంటైన్మెంట్ జోన్లలో నివాసం ఉంటున్న అధికారులు, ఇతర సిబ్బందికి కూడా మినహాయింపు ఉంటుందని జితేంద్ర సింగ్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాలపాటు ప్రధాని మాట్లాడారు. జీవో 317 సవరించాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడి అభినందించారు. జనవరి 2 న జాగరణ దీక్ష సందర్భంగా బండి సంజయ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఎందుకు అలా చేసిందని ఆరా తీశారు ప్రధాని మోడీ. తెలంగాణలో బీజేపీకి…
ప్రధాని కాన్వాయ్ ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా రాష్ట్రపతికి నివేదించండి అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసి వినతి పత్రం అందజేసింది బీజేపీ ప్రతినిధి బృందం. ఈనెల 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ప్రధానమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపడంతోపాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖకు నివేదించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గవర్నర్…
ఇటీవల ప్రధాన మోడీ పంజాబ్ పర్యటనకు వెళ్లారు. అయితే మోడీ కాన్వాయ్ వస్తున్న విషయం తెలిసిన అక్కడి రైతులు రోడ్డుపై బైఠాయించి మోడీ కాన్వాయ్కి అడ్డుపడ్డారు. సుమారు 15 నిమిషాల పాటు రైతులు అడ్డుతొలుగుతారేమోనని మోడీ ఎదురుచూశారు. అప్పటికీ రైతులు ఆందోళనను విరమించకపోవడంతో మోడీ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం దేశంలోనే హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఘటన దురదృష్టకరమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన…