Kcr Front Venue: బీజేపీ వ్యతిరేక శక్తుల వేదిక ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 కి ముందే దేశంలో మరో ఫ్రంట్ రాబోతోందా? తెలంగాణ దానికి వేదిక కాబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో వున్నారు. వీరందరి సమావేశానికి ముహూర్తం ఖరారైందా ? అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రాంతీయ పార్టీల భేటీ జరిగే అవకాశం ఉందా ? ప్రాంతీయ పార్టీల సమావేశంకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోందా ? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న పార్టీలు ఒక్క తాటిపైకి రావడానికి కసరత్తు మొదలైంది.ఇప్పటికే టీఆర్ఎస్,టీఎంసీ,డీఎంకే,ఎన్సీపీ, శివసేన ,ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా కలసి ముందుకు నడిచే దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా త్వరలో ప్రాంతీయ పార్టీలు,బిజెపిని నిలువరించాలని అనుకుంటున్న శక్తుల సమావేశంను సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు.అన్ని ప్రాంతీయ పార్టీలు జట్టుగా బీజేపీపై రాజకీయ పోరాటం కోసం ఎజెండా సిద్ధం చేసే కసరత్తు జరుగుతుంది .
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడుతాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి సానుకూలంగా ఫలితాలు ఉండకపోవచ్చు అని ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల లెక్కలుగా ఉన్నాయి.అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత …ప్రాంతీయ పార్టీల సమావేశం ఉండే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఆశిస్తున్న ఫలితాలు రాకపోతే…ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుపై మరింత వేగం పెంచే అవకాశం ఉంది.
మరోవైపు మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో యూపీ ఎన్నికల ప్రచారంకు మమత బెనర్జీ సిద్ధం అయ్యారు. ఆ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రాంతీయ పార్టీలు ఆ వేదికను కలసి పంచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి పార్టీల సమావేశం హైదరాబాద్ లో ఉంటుందా లేక మరొక చోట ఉంటుందా అన్నది మార్చిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, మహారాష్ట్ర సీఎం ఉథ్దవ్ థాకరే లాంటివారు బీజేపీయేతర ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్నారు. వీరంతా కలిసి ఒక వేదిక ఏర్పాటుచేస్తే వీరితో భావసారూప్యం వున్న పార్టీలు కలిసి వస్తాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!