ఈనెల 6న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని 508 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టునున్నారు. రూ.24,470 కోట్ల వ్యయంతో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కేంద్రం ఈ పనులకు చేపడుతోంది.
Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలిశారు.
KA Paul Intresting Comments on Pawan Kalyan: కేఏ పాల్ అంటే తెలియని తెలుగు వారే కాదు ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేసి ఒకప్పుడు వైట్ హౌస్ ముందే స్పీచ్ లు ఇచ్చారు. అయితే తరువాతి కాలంలో మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నేటి యూత్ ఆయనని ఒక కామెడీ పీస్ లా ఫీల్ అవుతున్నారు. అయితే నిజానికి తెలుగు…
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం ఎన్‌డిఎ కుటుంబాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తుంది. రాష్ట్రాలలోని చిన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే.. ఎన్డీయేకు ఎక్కువ సీట్లు వస్తాయి. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.
శనివారం అబుదాబిలో యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఏర్పాటు చేసిన విందు భోజనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పూర్తి శాఖాహార భోజనం అందించారు. ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఈరోజు యూఏఈ చేరుకున్నారు. మెనూలోని చిత్రం ప్రకారం, ప్రధాని మోదీకి మొదట స్థానిక సేంద్రీయ కూరగాయలతో పాటు హరీస్ (గోధుమలు) మరియు ఖర్జూరం సలాడ్ అందించారు. దీని తర్వాత మసాలా సాస్‌తో కాల్చిన కూరగాయలతో కూడిన స్టార్టర్ వచ్చింది..,…
గల్ఫ్ దేశంలో త్వరలోనే ఐఐటి ఢిల్లీ ప్రవాస క్యాంపస్‌ను ప్రారంభించనుంది. అక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు విద్యా మంత్రిత్వ శాఖ మరియు అబుదాబి విద్యా మరియు నాలెడ్జ్ శాఖ (ADEK) ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు.
మణిపూర్ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు నిరంతరం దాడి చేస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్నారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాహుల్ ట్వీట్ సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.