ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో అర్థరాత్రి బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. 2024 ఎన్నికల్లో వ్యవహారించాల్సిన వ్యూహాంపై చర్చించడానికి బీజేపీ ఎన్నికల వ్యూహా కమిటీ సమావేశం అత్యవసరంగా నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో 5 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని బోపాల్ ఆర్కమలపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను భౌతికంగా జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చారు. ప్రధాని పర్యటనలో భాగంగా భారత్ కు సెమీకండక్టర్, జెట్ ఇంజిన్ టెక్నాలజీ, టెస్లా లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అంతేకాకుండా అటు అమెరికా కూడా చాలా లాభపడింది. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 8 వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. ఇందులో శెనగలు, కాయధాన్యాలు, యాపిల్స్, వాల్నట్లు మరియు బాదం పప్పులు ఉన్నాయి.
విదేశీ పర్యటన ముగించుకొని దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి మణిపూర్‌లోని తాజా పరిస్థితుల గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వివరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని శనివారం ఈజిప్ట్‌కు చేరుకున్నారు. ఈజిప్టు రాజధాని కైరోలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీని రిసీవ్ చేసుకోవడానికి ఈజిప్ట్ ప్రధాని వచ్చారు. అక్కడ ఇద్దరు నేతలూ ఆప్యాయంగా కలుసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ను నడిపించేది కేసీఆరేనని అన్నారు. అట్లాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ లో ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం అస్సాంలోని శివసాగర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. యూపీఏ పాలనపై మండిపడ్డారు. భారత దేశం 2014 ముందు ఎలా ఉంది.. 2014 తర్వాత ఎలా ఉంది. దేశంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయంటూ ఆయన అన్నారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్రం ప్రభుత్వం యోచిస్తుంది. మరోవైపు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాలకు ప్రధాని నేతృత్వం వహించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా నిర్వహించుకోవాలని 9 ఏళ్ల క్రితం ఇదే ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ తొలిసారి ప్రతిపాదించారు.
జీ-20 సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ప్రపంచ ఆహార భద్రతను సాధించేందుకు సమిష్టి చర్యను ఎలా చేపట్టాలనే దానిపై చర్చించాలని జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.