సంగారెడ్డిలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ నెల 20న సంగారెడ్డి అభివృద్ధిపై చర్చ పెడుతానని కామెంట్స్ చేశారు. సదాశివపేటలో 1200 ఎకరాలలో చారిటీ సిటీ కట్టాను.. సంగారెడ్డిలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు.. చారిటీ సిటీని చూసి దేశ విదేశ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారు.. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేసి నా చారిటీ మూయించారు అని కేఏ పాల్ తెలిపారు.
Read Also: Tiger Nageswara Rao: 8 ఏళ్లకే రక్తం తాగిన స్టూవర్టుపురం దొంగ సర్ వాడు..
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ తొత్తు.. తొమ్మిది ఏళ్లలో ఏనాడు జగ్గారెడ్డిని నేను శపించలేదు అని కేఏ పాల్ అన్నారు. జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నా.. సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నా పార్టీలో చేరు అని ఆయన చెప్పారు. అయితే, ఇప్పటి వరకు జగ్గారెడ్డిని క్షమించాను.. ఇక నుంచి క్షమించను.. వెయ్యి కోట్లు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీలో చేరుతావా.. అభివృద్ధి చేసే నా పార్టీలో చేరుతావా తేల్చుకో అని పాల్ తెలిపాడు.
Read Also: Upendra: దళితులపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన ఉపేంద్ర
ఎన్ని సీట్లు వచ్చిన వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అని కేఏ పాల్ అన్నారు. పొత్తులు పెటుకోవడానికి ఇతర పార్టీలు నా దగ్గరికి వస్తున్నాయి.. కానీ నాకు ఇప్పుడు పొత్తుల ఆలోచన లేదు.. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా నిలబడమని చెబితే పోటీ చేస్తా.. నన్ను గెలిపించి సీఎం చేస్తే అభివృద్ధి చేస్తా.. కేసీఆర్, గద్దర్ బతికి ఉన్నప్పుడు ఏనాడు పట్టించుకోలేదు..గద్దర్ చచ్చిపోతే అన్ని పార్టీల నాయకులు కుక్కల్లాగా వాలిపోయారు కేఏ పాల్ కామెంట్స్ చేశాడు.
Read Also: Online Gaming Sites: భారీగా బాకీ పడిన ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు… నోటీసులు జారీ చేయనున్న కేంద్రం
మంత్రి మల్లారెడ్డి భూములు కబ్జా చేస్తున్నాడు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ఆరోపించాడు. కేటీఆర్ గూగుల్ ని కనిపెట్టినట్టు బిల్డప్ ఇస్తున్నాడు.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నా అతడికే టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు.. అసలు ఓటు బ్యాంకు లేదు అతనికి.. ఆర్ఎస్ఎస్ వల్లే అతడు పీసీసీ అయ్యాడు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని నేను ఎప్పుడో చెప్పాను.. ఈటల, రఘునందన్, విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ లు కూడా ఒక్కటేనని చెప్పారు అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి అని పాల్ అన్నారు.
Read Also: Etela Rajender: నువ్వేం నిజాం సర్కార్ వు కాదు.. డిసెంబర్ వరకే మీకు అధికారం
న్యాయ వ్యవస్థ 90 శాతం అవినీతి మయం అయిపోయింది అని కేఏ పాల్ అన్నారు. నరేంద్ర మోడీ, కేసీఆర్, రాహుల్ గాంధీని ఢీ కొట్టే శక్తి కేఏ పాల్ కే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కవితని ఈడీ అరెస్ట్ చేయకపోతే బీజేపీ 40 సీట్లు గెలుస్తుంది అని చెప్పాను.. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం ఉందని పాల్ అన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న చాలా మంది మంత్రులు నాతో టచ్ లో ఉన్నారు.. నేను గెలిస్తేనే తెలంగాణ బాగుపడుతుందని కేఏ పాల్ చెప్పారు. ఇక, మెగాస్టార్ చిరంజీవి కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగా ఇబ్బంది పెట్టారు.. బీజేపీకి ప్యాకేజ్ స్టార్ చిరంజీవి, పవన్ అని పాల్ విమర్శలు గుప్పించాడు.