Lok sabha: సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోడీ లాస్ట్ స్పీచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) లోక్‌సభలో (Lok sabha) ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోసారి విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి మోడీ సమాధానమిచ్చారు. ప్రతిపక్షాలకు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కోల్పోయారంటూ ఎద్దేవా చేశారు.
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదగబోతున్నట్లు వెల్లడించారు. మా పాలనను వెయ్యేండ్ల పాటు ప్రజలు గుర్తించుకునేలా వచ్చేసారి పరిపాలిస్తామని పేర్కొన్నారు. మూడోసారి బీజేపీకి 370 సీట్లు ఖాయమని.. ఎన్డీఏ కూటమికి మొత్తం 400 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని విభజించడమే విపక్షాలకు తెలుసు అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని.. అందుకే చాలా మంది రాజ్యసభకు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.
Also Read
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
కాంగ్రెస్ బుద్ధి మారలేదు.. జాలేస్తోంది
పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు (Congress) మారలేదు అన్నారు. కుటుంబ పాలనతో దేశం ఎంతో నష్టపోయిందని.. కాంగ్రెస్ నాయకులు కూడా అంతే నష్టపోయారన్నారు. ఆ పార్టీలోని యువనాయకులను కూడా దెబ్బ తీస్తున్నారని.. చాలామంది కాంగ్రెస్‌ను వీడుతున్నా ఆ పార్టీ తీరు మారడం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నత్తనడకలో ఆ పార్టీలో ఎవరూ పోటీ పడలేరని. తాను విఫలమై.. మిగతా విపక్షాలు కూడా పని చేయకుండా కాంగ్రెస్ చేస్తోందని తెలిపారు. తోటి విపక్ష పార్టీలను కూడా ఎదగనీయడం లేదన్నారు. ఇండియా కూటమి కుదుపులకు లోనైందని చెప్పారు. విపక్షాల సంకల్పానికి తాను సలహా ఇస్తున్నా. ఎన్నికలొస్తున్నాయి.. ఇప్పుడైనా కష్టపడండంటూ కాంగ్రెస్‌కు మోడీ చురకలంటించారు.
నెక్ట్స్ టార్గెట్ ఇదే..
పదేళ్ల క్రితం ప్రపంచంలోని 11వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ ఉందని… ఇప్పుడు ఐదో స్థానంలో ఉందన్నారు. ఎవరేం అనుకున్నా హ్యాట్రిక్ విజయం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు. మూడో టెర్మ్‌లో మాత్రం దేశం మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..