Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Prime Minister Initiates Many Railway Development Works In Telangana

PM Modi: తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం..

Published Date :February 24, 2024 , 11:29 am
By Bhanu
PM Modi: తెలంగాణలో పలు రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Modi: తెలంగాణ రాష్ట్రంలో పలు రైల్వే అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన.. ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నెల 26న (సోమవారం) దేశవ్యాప్తంగా 500 కు పైగా అమృత్ భారత్ స్టేషన్లు, దాదాపు 1,500 రైల్ ఫ్లై ఓవర్లు/అండర్ పాస్ లకు భూమిపూజ/జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ. 169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ లు, రూ. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు రూ. 621 కోట్లు ఉంటుందని అంచనా.. తెలంగాణలోని మొత్తం 40 అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధికి ఖర్చు చేస్తున్న మొత్తం రూ. 2,245 కోట్లు, ఇందులో, రూ. 894 కోట్ల అంచనా వ్యయంతో గత ఆగస్టులో 21 అమృత్ భారత్ స్టేషన్ల పునరాభివృద్ధికి భూమిపూజ చేయనున్నారు. అయితే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపి, హర్షం వ్యక్తం చేశారు.

Read also: IND vs ENG 4th test: తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్‌

న్యూఢిల్లీ 24 ఫిబ్రవరి, 2024..

* 2014 లో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటి నుంచి రైల్వేలలో దేశం ఘననీయమైన పురోగతి సాధిస్తూ వస్తోంది. కొత్త రైల్వేలైన్లతో పాటు, రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాలలో డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల నిర్మాణం అత్యంత వేగంగా సాగుతోంది. అంతేకాకుండా, రైల్వేలలో 100 శాతం విద్యుద్దీకరన సాధన లక్ష్యంగా పని చేస్తున్న భారతీయ రైల్వే ఆ దిశగా చేపట్టిన పనులు పెద్దఎత్తున పురోగతి సాధించాయి.

* నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంతవరకూ రైల్వే సౌకర్యం లేని అనేక ప్రాంతాలకు కొత్తగా రైల్వే ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయి. రైల్వే ప్రమాదాలను నివారించడానికి గార్డు లేని రైల్వే క్రాస్ లను పూర్తిగా తొలగించింది. వీటితోపాటుగా రైల్వే క్రాస్ ల వద్ద రద్దీని నివారించడానికి వీలుగా అవసరాన్ని బట్టి రైల్ ఫ్లై ఓవర్లను, రైల్ అండర్ పాస్ లను నిర్మిస్తూ వస్తోంది.

* స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కవచ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ లలో అమలు చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక రైళ్ల గమ్యస్థానాలను పొడిగించడమే కాకుండా, వందేభారత్, అమృత్ భారత్ వంటి ఆధునిక కాలపు రైళ్లను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.

* రైళ్లు, రైల్వే లైన్ల విస్తరణ మీద మాత్రమే కాకుండా రైల్వేస్టేషన్లను ఆధునీకరించి, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను కల్పించాలని మోదీ ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందులో భాగంగా “అమృత్ భారత్ స్టేషన్ల” పేరిట నూతన పథకాన్ని ప్రారంభించిన భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ఉన్న అనేక రైల్వేస్టేషన్లను ఆధునీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

* తెలంగాణలో కూడా 40 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేయాలని భావించిన రైల్వేశాఖ మొత్తం రూ. 2,245 కోట్ల నిధులను కేటాయించింది. ఈ 40 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లకు గాను, గత ఆగస్టు నెలలో 21 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 894 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయడం జరిగింది.

* ఇప్పుడు మరో 15 అమృత్ భారత్ స్టేషన్లలో రూ. 230 కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఈ నెల 26 న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు శంకుస్థాపన చేయనున్నారు.
ఆయా అమృత్ భారత్ స్టేషన్లు, కేటాయించిన నిధుల వివరాలు..

* జడ్చర్ల – రూ. 10.94 కోట్లు
* గద్వాల్ – రూ. 9.49 కోట్లు
* షాద్ నగర్ – రూ. 9.59 కోట్లు
* మేడ్చల్ – రూ. 8.37 కోట్లు
* మెదక్ – రూ. 15.31 కోట్లు
* ఉందా నగర్ – రూ. 12.37 కోట్లు
* బాసర – రూ. 11.33 కోట్లు
* యాకుత్ పుర – రూ. 8.53 కోట్లు
* మిర్యాలగూడ – రూ. 9.50 కోట్లు
* నల్గొండ – రూ. 9.50 కోట్లు
* వికారాబాద్ – రూ. 24.35 కోట్లు
* పెద్దపల్లి – రూ. 26.49 కోట్లు
* మంచిర్యాల – రూ. 26.49 కోట్లు
* వరంగల్ – రూ. 25.41 కోట్లు
* బేగంపేట – రూ. 22.57 కోట్లు కేటాయించబడ్డాయి.

Read also: OG Movie: పవన్ ఎన్నికల్లో బిజీ అయినా అనుకున్న రోజుకే దింపుతాం!

* అమృత్ భారత్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని బట్టి అనేక సౌకర్యాలను కల్పించనున్నారు. అందులో ఐకానిక్ స్టేషన్ బిల్డింగ్, స్టేషన్ కు రెండు వైపులా ఉన్న బిల్డింగులను, అన్ని ప్లాట్ ఫామ్ లను కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, పార్కింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచి, ట్రాఫిక్ ఇబ్బందుల తొలగింపు, వచ్చి/ వెళ్ళే ప్రయాణికులకు ప్రత్యేక మార్గాల ఏర్పాటు, లిఫ్ట్ లు, ఎస్కలేటర్ల ఏర్పాటు, దివ్యాంగుల రాకపోకలకు వీలుగా సౌకర్యవంతమైన ఏర్పాట్లు, ఇల్యూమినేషన్, సైన్ బోర్డ్ ల ఏర్పాటు, ప్రయాణికుల రక్షణ కోసం అధునాతనమైన CCTV ల ఏర్పాటు, స్వయంగా స్టేషన్ కు అవసరమైన విద్యుత్ ను తయారు చేసుకునేలా గ్రీన్ బిల్డింగ్ ల ఏర్పాట్లు తదితరాలు ఉన్నాయి.

● అమృత్ భారత్ స్టేషన్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో రూ. 169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 1 రైల్ ఫ్లై ఓవర్ కు, 16 రైల్ అండర్ పాస్ లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.

● హైదరాబాద్ డివిజన్ లోని బోధన్ వద్ద రైల్ ఫ్లై ఓవర్, మేళ్ల చెరువు, కురుముర్తి వద్ద 2, చిలకమర్రి, గౌడవల్లి, కీసర, రామాంతపూర్, పాలాట, కూచవరం వద్ద 2 మదనపూర్, గద్వాల్ వద్ద రైల్ అండర్ పాస్ లు
● సికింద్రాబాద్ డివిజన్ లోని కురచపల్లి, వెలమల, చాగల్ వద్ద రైల్ అండర్ పాస్ లు,

● గుంతకల్ డివిజన్ లోని నారాయణపేట వద్ద రైల్ అండర్ పాస్ ల నిర్మాణం జరగనుంది. వీటితో పాటు ఆయా డివిజన్లలో రూ. 221 కోట్లకు పైగా నిధులతో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న 3 రైల్ ఫ్లై ఓవర్ లను, 29 రైల్ అండర్ పాస్ లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. అందులో

● హైదరాబాద్ డివిజన్ లోని మహబూబ్ నగర్ రూరల్, పెద్దదిన్నె, తిప్పాపూర్, గద్వాల్, సిద్దరామేశ్వర్ నగర్, బైరవాపురం, తలమడ్ల, ఇతిక్యాల, అడ్లూర్, నవీపేట్, ఉండవల్లి వద్ద రైల్ అండర్ పాస్ లు..

Read also: RBI : విదేశీ మారకద్రవ్యంలో భారత్ రికార్డులు..11 నెలల్లో ఖజానాలోకి రూ.4 లక్షల కోట్లు

● సికింద్రాబాద్ డివిజన్ లోని ఎర్రగుంట, ఉంకిచర్ల/నిరుపమకొండ, చర్లపల్లి వద్ద రైల్ ఫ్లై ఓవర్ లు, విలాసాగర్, బిస్ బాగ్, శివపురం, కాశీపేట్, మంచిర్యాల, బూడ, కాజీపేట్, గరిడపల్లి, మీనవోలు, బయ్యారం, దెందుకూరు, ముత్యాలగూడెం, రాజనెల్లి, ఉప్పరపల్లి వద్ద రైల్ అండర్ పాస్ లు..

● గుంటూర్ డివిజన్ లోని నర్కెట్ పల్లి, కీసరజూపల్లి, బుదారం వద్ద రైల్ అండర్ పాస్ లు..

● గుంతకల్ డివిజన్ లోని తంగడి వద్ద ఉన్న రైల్ అండర్ పాస్ ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున సహకరిస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు.

● 2014-15 లో రూ. 258 కోట్లుగా ఉన్న తెలంగాణ రైల్వే బడ్జెట్ కేటాయింపులను కేవలం 10 సంవత్సరాల కాలంలోనే దాదాపు 20 రెట్లు పెంచి 2024-25 నాటికి రూ. 5,071 కోట్లకు చేర్చడం తెలంగాణలో రైల్వేల అభివృద్ధి మీద మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇంతవరకూ ఎలాంటి రైలు సౌకర్యం లేని మెదక్, సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కొత్తగా రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, ఆదాయపరంగా అనుకూలం కాకపోయినా మల్లన్న భక్తుల కోసం కొమురవెల్లిలో నూతన రైల్వే హాల్ట్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నామని, స్టేషన్ నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించుకున్న విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైల్వేలలో అపూర్వమైన రీతిలో అభివృద్ధిని సాధించడానికి మరింతగా కృషి చేస్తామని, రాష్ట్రంలో రైల్వేల రూపురేఖలను సమూలంగా మార్చివేస్తామని కిషన్ రెడ్డి తెలియజేశారు.
Hyderabad Road Accidents: నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • development works in Telangana
  • modi
  • Modi initiates many railway
  • Prime Minister initiates many railway development works in Telangana
  • Prime Minister Modi

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions