Ponnam Prabhakar : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, జిల్లా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు… మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ని అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేస్తున్నారు మతోన్మాదులు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ ఎజెండాతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ కి తగిన గుణపాఠం చెప్పాలని అభ్యర్థిస్తున్నానని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరుతున్నాని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరంర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని, గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందన్నారు. నాలుగు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, నాటి ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి గడగడలాడించారన్నారు.
Shiv Sena-UBT: ఆప్-కాంగ్రెస్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి పోరాడాయి..
ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకమన్నారు. అనంతరం పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో నుంచి పరిశీలించి సత్తా ఉన్న నరేందర్ రెడ్డి ని అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగిందని, కాంగ్రెస్ అంటే కమిట్మెంట్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తామని చెప్పాము ఇచ్చామని, బీజేపీ తో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. డిపాజిట్ రాదనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కేసీఆర్ ఏడాదికి 5వేల ఉద్యోగాలు ఇస్తే సీఎం రేవంత్ నెలకు 5వేల ఉద్యోగాలు ఇస్తున్నారన్నారు. ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని, కేంద్రమంత్రిగా ఉండి బండి సంజయ్ రూపాయి కూడ తీసుకు రాలేదన్నారు. బడ్జెట్ లో తెలంగాణ రూపాయి పెట్టించలేని బీజేపీ నలుగురు ఎంపీ లు సమాధానం చెప్పాలని, కాంగ్రెస్ మాట నిలుపుకుంది కాబట్టి నరేందర్ రెడ్డి కి ఓటు వేయాలన్నారు. ఏడాది కాలం లో రేవంత్ రెడ్డి ,శ్రీధర్ బాబు రెండు లక్షల 30 కోట్లు పెట్టుబడులు తీసుకు వచ్చారని, ఏ ప్రభుత్వం కూడ చేయని కుల సర్వే చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. బీసీ కుల గణన చారిత్రాత్మకం . కాంగ్రెస్ చేసిన కుల గణన వల్లే 56శాతం బీసీలున్నట్లు తేలిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Laila: పృథ్వి రాజ్ కామెంట్స్ కలకలం.. షైన్ స్క్రీన్స్ కీలక ప్రకటన