Anji Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. గురువారం అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది చాలా విలువైన పాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల తరుఫున పోరాటం చేసేందుకు అవకాశం కల్పించండని ఆయన కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మండలిలో పోరాటం చేస్తానని ఆయన అన్నారు.
Minister Seethakka : దేశంలో ఏ రాష్ట్రం కులగణన చేయలేదు.. మనమే కులగణన చేసి చూపెట్టినం
అంతేకాకుండా.. మండలానికి ఒక ఇంటర్నేషనల్ పాఠశాల లు ఏర్పాటు చేస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని అంజిరెడ్డి ఆరోపించారు. యువ వికాసం పేరుతో ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్, ఇప్పుడు విద్యార్థులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని అన్నారు. స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులకు తీవ్ర అవరోధాలు సృష్టించిందని విమర్శించారు. రాష్ట్రంలో మెరుగైన విద్య ,వైద్యం అందించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని మాట ఇచ్చి తప్పారని, అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు అంజిరెడ్డి. అటు రైతులను కూడా కాంగ్రెస్, బీఅర్ ఎస్ ప్రభుత్వాలు మోసం చేశాయని ఆయన ఆరోపించారు.
Health: ఈ జ్యూస్ తాగితే 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు..