ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన సత్తా చాటుతోంది. 43 స్థానాల్లో లీడింగ్ లో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఎమ్మెల్సీ ఎన్నికల పై బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, రాష్ర్ట పదాదికారులతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీ ఎన్నికల ఫిలితాలపై ప్రస్తావించారు. ఢిల్లీలో విజయం సాధిస్తున్నామని అన్నారు. అదే ఊపుతో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఓ నమ్మకం. నిజాయతీ పాలన బీజేపీ తోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారు.దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేస్తున్నాం. తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉంది. దాన్ని గెలుపుగా మలచుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.
ఢిల్లీలో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తుండగా కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటున్నారు. డిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ కి అనుకూలంగా ఉండడంతో సంబరాలు చేసుకోవడానికి పార్టీ ఆఫీసుకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో కూర్చుని డిల్లీ ఎన్నికల ఫలితాలు Ntv స్క్రీన్ లో వీక్షిస్తున్నారు. డిల్లీ ఫలితాలపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఎద్దేవ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్కు గాడిద గుడ్డు వచ్చింది.. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కు గాడిద గుడ్డే వస్తుంది.. బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం.. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయిందని సెటైర్స్ వేశారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై NTV తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఢిల్లీ లో బీజేపీ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ విజయం బీజేపీ శ్రేణులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటి నుంచి ప్రజా రంజకమైన పాలన చూడబోతున్నారు. ఆంద్రప్రదేశ్ లో కూడా బీజేపీని బలోపేతం చేయడానికి ఈ విజయం బూస్టప్ గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో మొదట సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేస్తున్నాం అని పురందేశ్వరి తెలిపారు.