CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ మంత్రులకు టార్గెట్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 27న ఏపీలో రెండు గ్రెడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.. ఇంఛార్జ్ మంత్రులు.. కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు వెళ్లాయి. దీంతో జిల్లా ఇంఛార్జ్ మంత్రులు పర్యటనలో ఉన్నారు.. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు గ్రేడ్యుయేట్ స్థానాలకు.. విశాఖ -విజయనగరం – శ్రీకాకుళం ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా స్టార్ట్ అయ్యింది.. దీంతో, కూటమి నేతలు, మంత్రులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు..
Read Also: AP Cabinet Meeting: రేపే ఏపీ కేబినెట్ భేటీ.. ఎజెండాలో కీలక అంశాలు..!
తూర్పుగోదావరి – పశ్చిమగోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు.. ప్రధానంగా చదువుకున్న వారికి ఈ ప్రభుత్వం ఏ రకంగా మేలు చేస్తున్నది అనేది నేతలు ప్రచారంలో వివరిస్తున్నారు.. సీఎం చంద్రబాబు కూడా గ్రేడ్యుయేట్‌లను ఆకర్షించే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.. ఉభయగోదావరిలో సీపీఎం పోటీలో ఉంది. వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది.. ఇక, కృష్ణ – గుంటూరు గ్రేడ్యూయెట్ లకు సంబంధించి ఆలపాటి రాజా పోటీలో ఉన్నారు.. ఇక్కడ కూడా కృష్ణ – గుంటూరు మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ, పీడీఎఫ్ నుంచి పోటీ ఉంది.. దీంతో, మంత్రులు ప్రచారం ముమ్మరం చేశారు. సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసినట్టుగానే మంత్రులు, నేతలు.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.. విశాఖ – విజయనగరం – శ్రీకాకుళం టీచర్ ఎమ్మెల్సీ గా రఘువర్మ పోటీ చేస్తున్నారు. టీచర్ ఫెడరేషన్ నుంచి గాదె శ్రీనివాసులు పోటీలో ఉన్నారు.. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో విజయం సాధించాలని టీడీపీ దృష్టి పెట్టింది.. మంత్రులు కూడా ఈ మూడు వారాలు సీరియస్‌గా తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని.. విజయం సాధించాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..