కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరస విజయాలతో బీజేపీ దూసుకుపోతుంది.. వరసగా కాంగ్రెస్ ఓటమి చవిచూస్తుంది.. ఓటమిలో రికార్డు సృష్టిస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ కుటుంబం మీద రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రేమ కురిపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకం.. హామీలు అమలు చేయలేక అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో అభాసుపాలు అయ్యారని తెలిపారు. మంత్రులు ఒకరి పై ఒకరు పొట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. కాంగ్రెస్ అరువు తెచ్చుకొని డబ్బుల మూటలతో బరిలోకి దించిందని లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్ కు అడుకట్ట వేయకపోతే తెలంగాణ ప్రమాదంలో పడుతుంది.. గెలిస్తే రేవంత్ రెడ్డి తన అబద్ధపు మాటలకు ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటాడన్నారు. తెలంగాణ భవిష్యత్ మీ చేతుల్లో ఉంది.. ఆలోచించి ఓటు వేయండని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులది త్యాగాల చరిత్ర.. ఉద్యమాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఎంపీ లక్ష్మణ్ దుయ్యబట్టారు.
Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నా.. చర్చకు నేను రెడీ..
సోనియా గాంధీని బలి దేవత అన్న రేవంత్ రెడ్డికి అదే సోనియా గాంధీ ఇప్పుడు బంగారు దేవత అయిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి.. ఉద్యోగులు ఎందుకు ఓటు వేయాలి అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు.. వాళ్ళు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కి వచ్చి ముక్కు నేలకు రాసి పట్టభద్రుల ఓట్లు అడగాలి.. అరువు తెచ్చుకున్న అభ్యర్థిని గెలిపిస్తే రేవంత్ రెడ్డికి ఊడిగం చేస్తారని అన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మీ గొంతు అయ్యి ప్రశ్నిస్తారని చెప్పారు.
రేవంత్ రెడ్డి సర్వేకు ముడిపెట్టి 42 శాతం రిజర్వేషన్ల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.. సర్వేకు 42 శాతం రిజర్వేషన్లకి సంబంధం లేదని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. శాస్త్రీయ సర్వే చేసింది బీహార్‌లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం.. మీ అధికారులు వెళ్లి వచ్చింది అక్కడికేనని అన్నారు. కర్నాటకలో సర్వే చేశారు.. రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదన్నారు. తెలంగాణలో సర్వే వివరాలు పూర్తిగా బయట పెట్టండి.. గ్రామాల వారీగా చెప్పండని లక్ష్మణ్ తెలిపారు. మీ నెహ్రూ కుటుంబానికి సామాజిక న్యాయం పై ఉన్న చిత్తశుద్ది ఏంటో అందరికీ తెలుసు.. రిజర్వేషన్లు వ్యతిరేకించింది నెహ్రూ, రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. 12 శాతం ఉన్న ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఎలా న్యాయం అని అన్నారు. దేశ వ్యాప్తంగా ముస్లింలని బీసీ లలో చేర్చాలని కాంగ్రెస్ కుట్ర అని ఆరోపించారు. బీజేపీ భుజాల మీద తుపాకీ పెట్టీ కాల్చాలని చూస్తే బీసీలు ఊరుకోరు.. సిద్ధంగా ఉన్నారు కర్రు కాల్చి వాత పెడతారని లక్ష్మణ్ తెలిపారు.