Ponnam Prabhakar : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ కన్వేక్షన్ హల్ లో అర్బన్ మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వ నాథన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలలుగా మనం చేసిన అభివృద్ధి పనులు పట్టభద్రుల ఎన్నికల్లో మన అభ్యర్థి నరేందర్ రెడ్డి నీ గెలిపించాలన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత తీసుకొని మండలంలో ఉన్న 800 కి పైగా ఓట్లు ఒక్కోక్కరుగా బాధ్యత తీసుకొని వాళ్ళని ప్రత్యక్షంగా కలిసి వారు కాంగ్రెస్ కి ఓటు వేపించే బాధ్యత మీదని, ఎన్నికలను ఉదాసీనంగా తీసుకోవద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒకసారి ఓటరు కాంగ్రెస్ ను కాదని ఓటు వేరే పార్టీకి వేస్తే ఆది మీకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది వస్తదని, ఇది స్థానిక సంస్థల ఎన్నికల కొరకు రిహార్సల్ అనుకోండన్నారు. మీ ఊర్లో ఉన్న పట్టబద్రులు కాంగ్రెస్ వైపు తిప్పుకొని కాంగ్రెస్ కు ఓటు వేసేలా చేసే బాధ్యత స్థానిక నాయకులదని, బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నదన్నారు. బీజేపీ ఒకనాటి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు కేంద్ర మంత్రి వేములవాడకు నిధులు తీసుకొస్తా అన్నారు ఏం చేశారని, మేము వేములవాడ ఆలయ అభివృద్ధి,మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్య, సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్య లు పరిష్కారం చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే హిందువుల పేరు మీద రెచ్చగొడుతున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగల చేసి చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంటే బీసీల్లో ముస్లింలు ఉన్నారని అంటుండన్నారన్నారు.
Purandeswari: కేంద్రం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్.. మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌లో ఊరట
అంతేకాకుండా..’ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయిన తర్వాత ఈబీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చారూ.. ఈబీసీ రిజర్వేషన్లలో కూడా ముస్లింలు ఉంటారు… అక్కడ ఎవరైనా అంటున్నారా.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలను బీసీల్లో చేర్పించా అని చెప్పారూ.. వాళ్లు చేస్తే ఒప్పు మనం చేస్తే తప్ప.. మన గ్రామాల్లో దూదేకుల వాళ్లు లేకుండెన… దానికి మతపరమైన అంశాలు జోడించి రాజకీయం చేస్తున్నారు.. నేను హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిని మొన్న రంజాన్ మీటింగ్ అయింది 30 సంవత్సరాల నుండి రంజాన్ పండగకి ముస్లింలకి ఒక గంట ముందు ఇంటికి పంపిస్తారు.. మేము 15వ తేదీ జీవో ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో బిజెపి కూటమి ప్రభుత్వం 11వ తేదీ జీవో ఇచ్చింది.. బండి సంజయ్ ఇవేందయ్యా అంటున్నారు.. అక్కడ మాట్లాడం చేతకాదు ప్రతిదానికి మతం పేరుతో రెచ్చగొడుతున్నారు.. వేములవాడ దేవాలయానికి ప్రసాద్ స్కీం కింద ఏం చేశావు.. మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్య ఉంటే వారు ఇబ్బందుల్లో ఉంటే కేంద్రం నుండి ఇల్లు తెస్తాను అన్నావు ఏమైంది… సిరిసిల్ల ప్రాంతంలో టెక్స్టైల్ కార్మికుల కోసం ఏం చేశావు.. అసలు ఈ ప్రాంతంలో మిడ్ మానేరు ముంపు బాధితుల కోసం ఒక స్కిల్ సెంటర్ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా ఒక ఇండస్ట్రీ అయినా తీసుకొచ్చావా.. అలాంటప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు.. ఎవరి కొరకు ఓట్లు అడుగుతున్నారు.. కరీంనగర్ వ్యక్తిని కాదని వేరే వాళ్ల కోసం ఓటు అడుగుతున్నావు.. ప్రతి ఓటర్ను ప్రత్యక్షంగా కలిసి ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పడేలా చూడాలి.. ఒక ఓటు కూడా మిస్ కావొద్దు.. ఆ బాధ్యత స్థానిక నాయకత్వం దే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది.. రేపు సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు పట్టబద్రులంతా పాల్గొనాలి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Bangladesh: ఎలాన్ మస్క్‌ని బంగ్లాదేశ్‌కి ఆహ్వానించిన యూనస్.. ఎందుకంటే..