Off The Record: ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి ఎందుకు ప్రత్యేకం..?
- షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల ప్రకటన..
- అంగబలం, అర్ధబలం ఉన్నవాళ్ళే అభ్యర్థులు..
- కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న కాషాయ నేతలు..
- 4 ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధి..
- మూడున్నర లక్షల మంది ఓటర్లు..
- అసెంబ్లీ ఎన్నికలకు ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఎమ్మెల్సీ ఎలక్షన్స్..
- ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టిందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ సీట్లకు జరగబోతున్న ఎన్నికల్ని చాలా సీరియస్‌గా తీసుకుని వర్కౌట్ చేస్తోంది బీజేపీ. రెండు ఉపాధ్యాయ,ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా…షెడ్యూల్ రాక ముందే తమ అభ్యర్థులను ప్రకటించి అప్పట్నుంచి దూకుడుగానే ఉంది. అంగబలం, అర్థ బలం ఉన్న వారినే అభ్యర్థులుగా ప్రకటించి.. సాధారణ ఎన్నికల స్థాయిలో మేటర్‌ని సీరియస్‌గా తీసుకున్నారు కాషాయ నేతలు. ఈ ఎన్నికల ఓటర్లంతా చదువుకున్నవారు కావడం, ఆయా వర్గాల్లో తమ పార్టీకి పట్టుందన్న నమ్మకంతో… ఎట్టి పరిస్థితుల్లో సత్తా చాటాలని డిసైడైందట కమలదళం. అందుకే పార్టీ ముఖ్య నాయకులంతా… కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నట్టు తెలుస్తోంది. జరుగుతున్నది ఎమ్మెల్సీ ఎన్నికలే కదా… అందులోనూ ప్రభావం చూపగలిగే గ్రాడ్యుయేట్స్ సీటు ఒక్కటే. అయినా సరే… బీజేపీ ఎందుకింత తపన పడుతోంది? ఆ స్థాయి ఎఫర్ట్స్ ఎందుకు పెడుతున్నారని అంటే…. అసలు లెక్క అక్కడే ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. టీచర్ స్థానాలను పక్కనబెడితే… ఇప్పుడు ఎన్నికలు జరగబోతోంది ఒక్క గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికే అయినా… అది ఉత్తర తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో ఉంది. ఓటర్ల సంఖ్య దాదాపు మూడున్నర లక్షలు. ఈ లెక్కన చూసుకుంటే… పేరుకు ఒక్క సీటే అయినా… ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న బీజేపీ ఢిల్లీ పెద్దలు… ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రాక్టీస్ మ్యాచ్‌లా చూస్తున్నారట. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా… అందులో 42 నియోజకవర్గాలు ఇప్పుడు ఎలక్షన్ పరిధిలో ఉన్నందున ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ని పర్‌ఫెక్ట్‌గా ఆడితే… రేపు అసెంబ్లీ ఎన్నికలకు ఈజీగా ఉంటుందని భావిస్తున్నారట. ఆ క్రమంలోనే అటు ఆర్‌ఎస్‌ఎస్ కూడా ఆల్రెడీ రంగంలోకి దిగినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొదలుపెట్టి ఇక అసెంబ్లీ ఎన్నికల దాకా ఆర్‌ఎస్‌ఎస్ గ్రౌండ్ వర్క్ చేస్తుందని, అందుకే ఈ ఎలక్షన్ కూడా బీజేపీకి ప్రతిష్టాత్మకం అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ద్వారా… పార్లమెంట్ ఎలక్షన్స్ ఊపును కొనసాగించి…అసెంబ్లీకి రూట్ క్లియర్ చేసుకోవాలన్నది కాషాయ దళం ప్లానింగ్ అట. అందుకే మిగతా పార్టీలకంటే ఎక్కువగా అంత సీరియస్‌గా తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ మూడు సీట్లు గెలవడం ద్వారా… తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని రుజువు చేయాలనుకుంటున్నారట.
Also Read
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం 40 లక్షలు దాటింది. ఆ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపించాలని … తమది వాపుకాదని నిరూపించుకోవాలనుకుంటున్నారట. ఆ క్రమంలోనే కేంద్ర నాయకత్వం కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే… పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తాజాగా రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించి ఎమ్మెల్సీ ఎన్నికల పై రివ్యూ చేశారు. పోటీ చేస్తున్న అభ్యర్థులతో విడివిడిగా భేటీ అయ్యారు. ఎన్నికల్ని లైట్‌గా తీసుకోవద్దని సీరియస్‌గా చెప్పారట. అటు పార్టీ ముఖ్య నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టారట. తెలంగాణ పై ఎప్పటి నుండో కన్నేసిన కేంద్ర పార్టీ… ఇక ఏ అవకాశాన్ని వదులు కోవద్దని భావిస్తోందట. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే తెలంగాణలో భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందన్నది బీజేపీ ఢిల్లీ పెద్దల ఆలోచనగా చెప్పుకుంటున్నారు. ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌కు ముప్పు పొంచి ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!