MLC Elections: వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్ నివాసంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తోపాటు బిజెపి రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. విద్య వ్యవస్థలను కేసీఆర్ బ్రష్టు పట్టించారని.. అదే విధంగా కాంగ్రెస్ కూడా ముందుకు సాగుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని అన్నారు.
Read Also: YS Jagan: గుంటూరు చేరుకున్న వైఎస్ జగన్.. ర్యాలీగా మిర్చి యార్డ్ వద్దకు..!
పార్లమెంట్ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు మూడింతలు అధికంగా నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నేషనల్ హైవే కోసం అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత వుందని కేంద్రం ఇందుకు సంబంధించిన నిధులను చెల్లిస్తుందని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ భూ సేకరణలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భూ నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా కొనసాగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని విమర్శించారు.
Read Also: Bharat Jodo Vivah: భారత్ జోడో వివాహం.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్స్
కేంద్రంపై తప్పుబాటు మాటలు చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే భూ సర్వేను మళ్లీ చేపట్టాలని, లేనిపక్షంలో రైతుల తరుపున పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతుల పరిస్థితి దారుణంగా మారిందని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై వెంటనే స్పందించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.