ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బాలాజీ జిల్లాలో మంత్రి రోజా పర్యటిస్తున్నారు. వడమాలపేట మండలం ఎస్వీపురం గ్రామంలో మంగళవారం నాడు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మంత్రి రోజా వివరించారు. Varla Ramaiah: సజ్జల చేతుల్లో సీఐడీ పావుగా మారింది ఓ ఇంటి దగ్గర మంత్రి రోజా ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓ అమ్మాయిని…
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకు వైసీపీ పేరుతో ఇంటింటికీ తిరుగుతున్నారు. వైసీపీ మూడేళ్ల పాలన పూర్తి కావడం, ఇక రెండేళ్లు వుండటం, రెండేళ్లలో ఒక ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో, హరీబరీగా తిరుగుతున్నారట. ఇక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల మధ్యలో ఉండాలని అధిష్టానం ఆదేశించింది. గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చింది. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఎంతెంత ఇచ్చింది…పథకాల గురించి ప్రచారం చేయాలని ఆదేశించింది. అంతవరకూ బాగానే…
ఒంగోలులో టీడీపీ మహానాడు బహిరంగ సభ ప్రారంభం అయింది. భారీ ఎత్తున మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు కార్యకర్తలు. ఇంకా వివిధ మార్గాల్లో చేరుకుంటున్నారు. సాయంత్రం 5:30 గంటలకు బహిరంగ సభకు రానున్నారు చంద్రబాబు. 6:30 చంద్రబాబు ప్రసంగం వుంటుంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్. బహిరంగ సభకు బాలకృష్ణ హాజరు కానున్నారు. బడుగులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు,…
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి వేళ ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబునాయుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను టార్గెట్ చేశారు మంత్రి రోజా. ఎన్టీఆర్ తనయుడు బాలయ్యను చూస్తే జాలేస్తోందన్నారు రోజా. ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా బాలయ్య ఆరోజుల్లో వుండి వుంటే.. జగన్ సీఎం అయినట్టే బాలయ్య కూడా కీలక పదవిలో వుండేవారన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుండేదన్నారు. ఎన్టీఆర్ కొడుకుల అమాయకత్వాన్ని…
కోనసీమ జిల్లా మార్పు అంశంలో అమలాపురంలో జరిగిన అల్లర్ల ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కళ్యాణ్ చదివారని ఆమె ఆరోపించారు. కోనసీమ కోసం ఆత్మహత్య చేసుకుంటానన్న అన్యం సాయి అనే వ్యక్తి జనసేన కార్యకర్తేనని రోజా విమర్శలు చేశారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని గతంలో ప్రతిపక్షాలు అంగీకరించాయని ఆమె గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలే ప్రసక్తే లేదని…
కర్నూలు జిల్లా పర్యటనలో ఓర్వకల్లులోని రాక్ గార్డెన్‌ను మంత్రి రోజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో రాతి రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం, పిక్నిక్ స్థలాలు, వసతి కోసం హరిత రిసార్టు పర్యాటకులకు అందిస్తున్నామన్నారు. ఇది పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. మరోవైపు ప్రతిపక్షం టీడీపీపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పచ్చకామెర్లు ఉన్నాయని.. అందుకే ఆయనకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందని రోజా సెటైర్ వేశారు.…
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడూ పొలిటికల్ హీట్‌తో.. గ్రూపు రాజకీయాలతో రచ్చరచ్చగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక రగడ ఇక్కడ కామన్. ఇలాంటి క్రమంలో రాజకీయాల్లో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే.. మనం పది అడుగు వేయలనే ఆలోచనలో టీడీపీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ వ్యూహం మార్చారట. మొన్నటిదాకా సైలెంట్‌గా చక్రం తిప్పిన ఆయన.. రోజాకు మంత్రి పదవి వచ్చాక ప్లాన్ బీ అమలులోకి తెచ్చారట. జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్‌లో…
రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఈ జాతర…
విజయవాడలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఆప్కో ఎగ్జిబిషన్ షోరూంను పర్యాటక శాఖ మంత్రి రోజా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్కో షోరూంలో వస్త్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమ్మర్ శారీ మేళాకు తనను పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలకు నచ్చేలా అన్నీ ఆప్కో షోరూంలలో ఉన్నాయన్నారు. ప్రజలు కూడా ఆప్కో షోరూంలలో కొనుగోలు చేస్తూ ఆప్కో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. చేనేత కార్మికులకు మనం సహాయం చేస్తేనే వాళ్లు అభివృద్ధి…
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా శనివారం నాడు విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ రోజు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్‌లో అల్లూరి విగ్రహానికి పూలమలలు వేసి ఆమె నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలు గుర్తుంచుకునేలా జీవించారని వ్యాఖ్యానించారు. అల్లూరి పేరు చెప్తేనే చాలా మంది రోమాలు…